ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతకు షాక్:కేఆర్ సూర్యనారాయణపై సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణను సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారంనాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యేవరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఏపీ జీఈఏ, ఏపీ వాణిజ్య పన్నుల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కూడ కేఆర్ సూర్యనారాయణ చెప్పారు. కేఆర్ సూర్యనారాయణ ఇంకా పరారీలో ఉన్నాడని ప్రభుత్వం చెబుతుంది. తనపై నమోదైన కేసు విషయంలో విచారణకు సహకరించకుండా వ్యవహరిస్తున్నందున సూర్యనారాయణపై సస్పెన్షన్ వేటేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణతో పాటు వాణిజ్య పన్నుల శాఖకు చెందిన మరో ముగ్గురిపై విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
also read:ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణకు షాక్: ముందస్తు బెయిల్ కొట్టేసిన విజయవాడ ఏసీబీ కోర్టు
పన్ను ఎగవేతకు సంబంధించి వ్యాపారులతో కలిపి కుట్ర పన్నారని కేఆర్ సూర్యనారాయణతో పాటు మరో ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదైంది. ఈ కేసులో కేఆర్ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కోర్టులు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో సూర్యనారాయణ కన్పించకుండా పోయారు.ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణపై ఈ ఏడాది మే 31న విజయవాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో సూర్యనారాయణ ఏ-5 నిందితుడిగా ఉన్నారు