Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలో అన్యమత ప్రచారం: ప్రభుత్వం సీరియస్

తిరుమలలో బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేయడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ విషయంలో నివేదిక రాగానే  చర్యలు తీసుకోనుంది

ap government serious on non hindu ads over bus tickets
Author
Amravati, First Published Aug 23, 2019, 1:18 PM IST


తిరుమల: తిరుమలలో  బస్ టిక్కెట్ల అన్యమత ప్రచార ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని  సర్కార్ ఆదేశించింది. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం.

బస్సు టిక్కెట్ల వెనుక భాగంలో  అన్యమత ప్రచారానికి సంబంధించిన యాడ్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని తిరుమలకు వచ్చిన భక్తులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.తిరుమలకు వెళ్లే బస్సులో ఆర్టీసీ  ఇచ్చిన టిక్కెట్లపై ఈ యాడ్స్ ఉండడంపై భక్తులు,హిందూ ధార్మిక సంస్థలు, బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు.

శుక్రవారం నాడు తిరుపతిలోని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ విషయమై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు ఐదు టిక్కెట్ రోల్స్ వచ్చినట్టుగా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

అన్యమత ప్రచారం యాడ్స్ ఉన్న టిక్కెట్టు రోల్స్ ను ఆర్టీసీ వెనక్కి తెప్పించింది. నెల్లూరు డిపో నుండి ఐదు రోల్స్ తిరుపతికి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు.ఈ టిక్కెట్టు రోల్స్ సరఫరా చేసిన అధికారులు, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోనే అవకాశం ఉంది.ఈ విషయమై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.
 

సంబంధిత వార్తలు

తిరుమల కొండపై వివాదం: ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రకటనలు

Follow Us:
Download App:
  • android
  • ios