తిరుమల శ్రీవారి ఏడుకొండలపై మరోసారి అన్యమత ప్రచారం వివాదం తలెత్తింది. వెంకన్న దర్శనం కోసం తిరుమలలో ఆర్టీసీ బస్సు ఎక్కగా.. వారికిచ్చిన టిక్కెట్లపై జెరూసలేం యాత్ర, హజ్ యాత్రలకు సంబంధించిన ప్రకటనలు భక్తులకు కనిపించాయి.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఆర్టీసీ అధికారులను నిలదీశారు. పొరపాటును గ్రహించిన అధికారులు.. టిక్కెట్లకు సంబంధించిన రోల్స్‌ను తీసివేశారు.

నెల్లూరు నుంచి పొరపాటున ఐదు టికెట్ రోల్స్ తిరుమలకు వచ్చాయని వాటిని సిబ్బంది గమనించలేదని అధికారులు తెలిపారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ డీఎం హామీ ఇవ్వడంతో భక్తులు శాంతించారు.