Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు పరీక్షలకు సిద్దమైన ఏపీ సర్కార్... షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ (వీడియో)

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎంసెట్) షెడ్యూల్ ను ప్రకటించింది. 

AP  Government Released EAPCET schedule akp
Author
Amaravati, First Published Jun 19, 2021, 12:43 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు సిద్దమయ్యింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎప్ సెట్) షెడ్యూల్ ను ప్రకటించింది.  ఆగస్టు 19 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 

జూన్ 24న  ఎప్ సెట్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. జులై 25 వరకు విద్యార్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.  ఆగస్ట్ లో పరీక్షలు నిర్వహించి వీలైనంత తొందరగా ఫలితాలను కూడా ప్రకటిస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు. 

వీడియో

ఇదిలావుంటే తెలంగాణ మాత్రం నాలుగు కామన్ ఎంట్రన్స్ టెస్టులను రీ షెడ్యూల్ చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఉన్నత విద్యా మండలి. జూలై 5 నుంచి 9 వరకు జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను ఆగస్టుకు వాయిదా వేసింది. కొత్త తేదీలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. పీఈ సెట్, పీజీ ఈసెట్ తేదీల్లో కూడా మార్పులు చేసింది ఉన్నత విద్యామండలి. ఈ పరీక్షలు ఆగస్టు 1వ తేదీ నుంచి 15 మధ్య నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios