అమరావతి: తెలంగాణ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడ నెల రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేలా ప్రణాళికలను సిద్దం చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులను ప్రభుత్వం అందించనుంది. ఈ నెల 26వ తేదీన కొత్త పారిశ్రామిక విధానాన్ని ఏపీ ప్రభుత్వం ఖరారు చేయనుంది.

అందరికీ ఓకే విధానం పారదర్శక పారిశ్రామిక విధానం పేరుతో కొత్త ఇండస్ట్రీయల్ పాలసీని ఏపీ ప్రభుత్వం తీసుకురానుంది. ఈ మేరకు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అధ్యక్షతన గురువారం నాడు టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది.

నూతన పారిశ్రామిక విధానంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకొనేవారికి నెల రోజుల్లోనే అనుమతులు ఇచ్చేలా కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్చిస్తోంది. 

భూమి, పుష్కలంగా నీరు, నిరంతరాయంగా విద్యుత్, నైపుణ్యం కలిగిన మానవవనరులను పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలోని అన్ని వనరులను వినియోగించుకుంటూ పారిశ్రామికాభివృద్ధిని సాధించేందుకు ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. 

also read:అనంతపురంలోని కియా ప్లాంట్‌లో కరోనా కలకలం: ఓ ఉద్యోగికి పాజిటివ్

పర్యావరణానికి, ప్రజలకు హాని చేసే పరిశ్రమలకు అనుమతి ఇవ్వొద్దని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ రకమైన పరిశ్రమలు మినహా ఇతర ఫ్యాక్టరీల ఏర్పాటుకు సర్కార్ అనుమతిని ఇచ్చే అవకాశం ఉంది. 

అనినీతికి దూరంగా కొత్త పారిశ్రామిక విధానానికి సర్కార్ ముందుకు రానుంది. ఈ విధానంపై మంత్రి గౌతం రెడ్డి అధికారులతో చర్చించారు. సమావేశంలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టాస్క్ ఫోర్స్ కమిటీ వైస్ ఛైర్మన్ కరికాల వలవన్,  పరిశ్రమల శాఖ డైరెక్టర్, టాస్క్ ఫోర్స్ సీఈవో  సుబ్రమణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, పంచాయతీ రాజ్, మైనింగ్  శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, విద్యుత్ శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ తదితర ఉన్నతాధికారులు