అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో  వాస్తు  దోషాలను సరిచేసేందుకు కొత్త సర్కార్ పూనుకొంది. వాస్తు దోషాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని సరిచేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఫస్ట్ బ్లాక్‌లోని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం చాంబర్‌ను ఆగ్నేయ మూల నుండి మార్చనున్నారు. పాత చాంబర్ పక్కనే మరో చాంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు.

సీఎం చాంబర్‌కు వెళ్లే ద్వారాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. గతంలో చంద్రబాబునాయడు సీఎంగా ఉన్న సమయంలో కూడ వాస్తు దోషాలను గుర్తించి కొన్ని మార్పులు చేశారు.

చంద్రబాబునాయుడు రాకపోకలు సాగించే మార్గాన్ని కూడ ఆ సమయంలో మార్చి వేశారు. కొత్తగా జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడ వాస్తు మార్పులు చేయనున్నారు.