Asianet News TeluguAsianet News Telugu

రామతీర్థం ఘటన: సీఐడీ విచారణకు ఏపీ సర్కార్ ఆదేశం

రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు ఆదేశించింది.

AP government orders to CID probe on Ramateertham incident lns
Author
Guntur, First Published Jan 4, 2021, 7:02 PM IST

అమరావతి: రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు ఆదేశించింది.

ఇవాళ సాయంత్రం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పోలీసులు భేటీ అయ్యారు. పోలీసు అధికారులతో సుధీర్ఘ భేటీ  తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. రామతీర్థం ఘటనలో రెండు రోజుల్లో అరెస్టులు జరుగుతాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.

గత ఏడాది డిసెంబర్ చివర్లో రామతీర్ధంలోని బోడికొండపై కోదండరామస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజమండ్రిలోని సుబ్రమణ్యేశ్వర ఆలయంలో దాడిపై కూడ సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.అదే రోజున వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.  ఈ నెల 3వ తేదీన మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసులు ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు.

రాష్ట్రంలో వరుసగా దేవాలయాల్లో చోటు చేసుకొంటున్న ఘటనలు  రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. అధికార వైసీపీపై టీడీపీ సహా విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios