Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో పాఠశాల సెలవుల పొడిగింపుపై కీలక ప్రకటన.!

ఆంధ్రప్రదేశ్‌లోనూ క‌రోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ త‌రుణంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కొవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏపీలో కొవిడ్ నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ త‌రుణంలో పాఠ‌శాల నిర్వ‌హ‌ణ‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశ‌ముంద‌న్న‌ది.
 

AP Government May Extend Holidays To Educational Institutions Till Jan 30
Author
Hyderabad, First Published Jan 17, 2022, 2:10 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోనూ క‌రోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గ‌త వారంలో వేయి నుంచి రెండు వేయిల మ‌ధ్య‌లో న‌మోదైన కేసులు  ఇప్పుడూ ఏకంగా.. 5 వేల‌కు చేరువ‌గా న‌మోద‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో నియంత్రణ చర్యలు, వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి సీఎం సమీక్ష స‌మావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కోవిడ్ స‌మీక్ష స‌మావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ముఖ్యంగా కరోనా నియంత్రణలో భాగంగా ట్రేసింగ్‌, టెస్టింగ్‌పై ప్ర‌త్యేక్ష దృష్టి సారించాల‌ని ఏపీ స‌ర్కార్ యోచిస్తోంది. ఇప్పటికే ప‌లు ఆస్ప‌త్రిల్లో మౌలిక స‌దుపాయాల‌ను స‌మ‌కూర్చారు. ఆక్సిజన్‌ సహా అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం. ఈ త‌రుణంలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి చేయాల‌ని , ఈ మేర‌కు త‌గు చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌కు ప‌రోక్షంగా ఆదేశాలు చేరాయి. అలాగే రాష్ట్రంలో క‌రోనా నిబంధ‌న‌లు క‌ఠిన త‌రం చేయాల‌ని.. మాస్క్ లేకపోతే జరిమానా విధించనున్నారు. ఇతర కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు.

ఈ క్ర‌మంలోనే పాఠశాలలకు సెలవులు పొడిగించే విషయంపై రాష్ట్ర విద్యా శాఖ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. నిన్న‌ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ సంక్రాంతి సెలవుల పొడిగింపుపై కీల‌క ప్రకటన  చేశారు. పాఠశాలలకు సెలవులు పొడిగించే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు. అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు ఇప్పటికే 13.87 శాతానికి చేరడంతో తల్లిదండ్రులు ఆందోళనలు వ్య‌క్తం చేస్తోన్నారు.  ఈ త‌రుణంలోపబ్లిక్ ఒపీనియన్ ఆధారంగా సెలవుల అంశంపై ఈ భేటీలో చ‌ర్చనున్నారు. ఈ క్ర‌మంలో   ఈనెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ విషయంపై నేడు పాఠశాల ముగింపు సమయం లోపల అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
  
విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి కాక‌పోవ‌డంతో పాఠశాలలు న‌డిపే విషయంలో ఏపీ విద్యాశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ స‌మ‌యంలో స్కూళ్లను కొనసాగిస్తే .. ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారే అవ‌కాశముంది. కరోనా కేసులు తీవ్రంగా వెలుగు చూసే అవ‌కాశ‌ముంద‌న్న‌ది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ మహమ్మారి వేగంగా వ్యాప్తిచెందుతోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో స్కూళ్లు తెరిస్తే వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇటు తెలంగాణ‌లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.  అప్ప‌టి దాకా ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. ఆ త‌రువాత క‌రోనా ప‌రిస్థితిని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకోనున్న‌ది. 

Follow Us:
Download App:
  • android
  • ios