విధానపరమైన నిర్ణయాలకు ఏజీ అనుమతి తప్పనిసరి: ఏపీ సర్కార్

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే విధానపరమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాల ముసాయిదాలకు ఇకపై అడ్వకేట్ జనరల్(ఏజీ) అనుమతిని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Government issues key G.O. on policy decissions lns

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే విధానపరమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాల ముసాయిదాలకు ఇకపై అడ్వకేట్ జనరల్(ఏజీ) అనుమతిని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విధానపరమైన ముసాయిదా పత్రాలను జారీ చేసే ముందు ఏజీ పరిశీలనకు పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం తీసుకొంటున్న విధానపరమైన నిర్ణయాలు, పథకాలు సాంకేతిక ఇబ్బందుల కారణంగా న్యాయ సమీక్షకు గురి కావాల్సివస్తోందని చెప్పారు.

దీన్ని అరికట్టేందుకు ఏజీ కార్యాలయం నుండి వాటిపై ముందస్తు అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.ప్రభుత్వ బిజినెస్ రూల్స్  ప్రకారం మంత్రిమండలి న్యాయ విభాగం నుండి అనుమతి వచ్చిన తర్వాత ముసాయిదా ప్రభుత్వ ఉత్తర్వు, ముసాయిదా విధానపత్రాలను ఏజీకి పంపాలని సూచించారు.

కీలకమైన నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు గాను సర్కార్ ఏజీ అనుమతిని తప్పనిసరి చేసింది. 

న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే ముందే వాటిని సరిచేసుకోనేందుకు వీలుగా ఏజీ అనుమతిని తప్పనిసరి చేసింది ఏపీ ప్రభుత్వం.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios