ఏపీ సర్కార్ గుడ్ న్యూస్: ప్రభుత్వ టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల

ప్రభుత్వ టీచర్ల బదిలీలపై  ఏపీ ప్రభుత్వం  సోమవారంనాడు  మార్గదర్శకాలను విడుదల  చేసింది

AP Government Issues Guidelines on Teachers Transfers  lns

అమరావతి:  ప్రభుత్వ టీచర్ల బదిలీలపై  ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను  సోమవారంనాాడు విడుదల  చేసింది. గత వారంలో  రాష్ట్ర ప్రభుత్వ   బదిలీలపై  ఏపీ ప్రభుత్వం  విడుదల  చేసిన విషయం తెలిసిందే .  ప్రభుత్వ  ఉద్యోగులు,  టీచర్ల బదిలీల  విషయమై   రాష్ట్ర ప్రభుత్వం  వేర్వేరుగా మార్గదర్శకాలను విడుదల చేసింది. 

8 ఏళ్లు  ఒకే చోట  పనిచేసిన  టీచర్లకు బదిలీలు తప్పనిసరిగా  రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించింది.  ఐదేళ్లు  ఒకే చోట  పనిచేసిన హెడ్మాస్టర్  బదిలీ తప్పనిసరి  చేసింది  జగన్ సర్కార్. కొత్త జిల్లాలు  యూనిట్ గా  టీచర్ల బదిలీలను నిర్వహించనుంది  ఏపీ ప్రభుత్వం . ఈ నెల  31లోపుగా  ఖాళీ అవుతున్న  టీచర్  పోస్టులతోనే  ప్రభుత్వం  బదిలీలను  నిర్వహించనుంది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  టీచర్ల బదిలీల   కోసం  జీవో  నెంబర్  47ను విడుదల  చేసింది.ఐదు  రోజుల క్రితం  ఉపాధ్యాయ సంఘాలతో   ఏపీ విద్యాశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ  సమావేశమయ్యారు.  ఉపాధ్యాయ  బదిలీలపై  సమావేశం  చర్చించారు.   గతంలో  కూడా ఇదే విషయమై  ఉపాధ్యా సంఘాలతో  మంత్రి బొత్స సత్యనారాయణ  చర్చించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios