అప్పులు పెరుగుతున్నాయి: అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశ పెట్టిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశ పెట్టింది.  వ్యవసాయరంగం మినహ ఇతర రంగాలు దెబ్బతిన్నాయని కాగ్ నివేదిక అభిప్రాయపడింది. 
 

AP Government Introduces CAG Report in Assembly

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఏటేటా పెరుగుతున్నాయని కాగ్ అభిప్రాయపడింది.గతంతో పోలిస్తే  జీఎప్డీపీ వృద్దిరేటు తక్కువగా నమోదైందని కాగ్ తెలిపింది. కరోనా కారణంగా వ్యవసాయ రంగం మినహ అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు.ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రభుత్వం బుధవారం నాడు ప్రవేశ పెట్టింది.

2020-21 లో జీఎస్డీపీ వృద్దిరేటు తక్కువగా నమోదైందని కాగ్  తెలిపింది.  కేంద్రం నుండి పొందే గ్రాంట్లు 45.69 శాతం పెరిగిందని కూడా కాగ్ వివరించింది. రెవిన్యూ ఖర్చులు 11.06 శాతం మేర పెరిగాయని కాగ్ నివేదిక తెలుపుతుంది.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా రుణం 44.07 శాతం పెరిగిందని ఆ నివేదికలో కాగ్ వివరించింది. రెవిన్యూ ఖర్చులను క్యాపిటల్ వ్యయంగా చూపించారని కాగ్ నివేదిక చెబుతుంది. కేటాయింపులకు మించి ఖర్చు  చేసిన విషయాన్ని కూడా ఈ నివేదికలో కాగ్ తెలిపింది.

2020-21లో 33, 230 కోట్లు రెవిన్యూ లోటుగా ఉంది. 2020-21 లో రూ,1,17,136 కోట్ల రెవిన్యూ రాబడులుంటే రూ,20,018 కోట్లను వడ్డీగా చెల్లించారని కాగ్ నివేదిక వివరించింది. కరోనా సహాయక చర్యల కోసం రూ. 337.25 కోట్లు ఖర్చు చేసిందని ఆ నివేదిక తెలిపింది. 2020-21లో 33, 230 కోట్లు రెవిన్యూ లోటుగా ఉంది. 2020-21 లో రూ,1,17,136 కోట్ల రెవిన్యూ రాబడులుంటే రూ,20,018 కోట్లను వడ్డీగా చెల్లించారని కాగ్ నివేదిక వివరించింది. కరోనా సహాయక చర్యల కోసం రూ. 337.25 కోట్లు ఖర్చు చేసిందని ఆ నివేదిక తెలిపింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios