రాష్ట్రంలోని చిత్తూరు, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో లాక్‌డౌన్ విధిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.  

అమరావతి: రాష్ట్రంలోని చిత్తూరు, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో లాక్‌డౌన్ విధిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాను కట్టడిచేసే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది. 

 తిరుపతి పట్టణంలో మధ్యాహ్నం రెండు గంటల వరకే వ్యాపార సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు స్వచ్ఛంధంగా దుకాణాలు మూసివేస్తామని తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ప్రకటించారు. జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, శ్రీకాళహస్తి, మదనపల్లి తదితర పట్టణాల్లో మినీ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. కడప జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడ మినీ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకొంది ప్రభుత్వం. విజయవాడలో కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కేసుల వ్యాప్తిని అరికట్టేంుదకు గాను ఏపీ ప్రభుత్వం మినీ లాక్ డ్ౌన్ లను అమలు చేస్తోంది. అంతేకాదు ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.