ఉద్యోగులతో పెట్టుకొంటే ఎవరైనా ఇబ్బంది పడాల్సిందే: ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ
పీఆర్సీపై జారీ చేసిన మూడు జీవోలపై స్టేటస్ కో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఇవాళ సీఎంఓ అధికారులతో భేటీ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు
అమరావతి: prc విషయమై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మూడు G.O.లపై status quo ఇచ్చి మరోసారి ఉద్యోగులతో చర్చించి కొత్త జీవోలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మంగళవారం నాడు పీఆర్సీ విషయమై CMO అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. జీవోల్లోని పొందుపర్చిన అంశాలు తమకు నష్టం చేసేలా ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. సీఎంఓ అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
పీఆర్సీ విషయమై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను అమలు చేయకుండా అవసరమైతే ఉద్యోగులకు రెండు నెలలు పాత జీతాలను కొనసాగిస్తూ తమతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పీఆర్సీ జీవోల విషయమై సీఎం Ys Jagan జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
మరోవైపు తమ కార్యాలయంలో అన్ని Employees సంఘాలతో రేపు సమావేశం కానున్నట్టుగా సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ మధ్య ఉన్న విబేధాలను పక్కన పెట్టాలని ఆయన కోరారు. అన్ని సంఘాలు సమావేశమై పీఆర్సీ కోసం ఏకతాటిపైకి వచ్చేందుకు కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
Ias అధికారుల సిఫారసులను CM పక్కన పెట్టాలని సూర్యనారాయణ సీఎంను కోరారు. ఉద్యోగులు ఏం కోరుకొంటున్నారు, పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల వైఖరిని ఇంటలిజెన్స్ ద్వారా తెప్పించుకోవాలన్నారు. కొత్తగా జారీ చేసిన జీవోలతో ఉద్యోగులు 4 నుండి 12 శాతం వేతనాలను కోల్పోయే అవకాశం ఉందని Suryanarayana అభిప్రాయపడ్డారు.
27 శాతం IRను ప్రొటెక్ట్ చేసేలా ఫిట్ మెంట్ కొనసాగించి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి ప్రకటించిన పిఆర్సీ తో పాటు ఇతర అంశాలు ఆమోదం కాదని ఆరోజే చెప్పామని ఆయన గుర్తు చేశారు.కొన్ని ఉద్యోగుల సంఘాల నేతల సంక్రాంతి తరవాత అన్నింటి మీద ప్రకటన వస్తుందని ఆశ పడ్డారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోల పై ముఖ్యమంత్రి నే పునఃసమీక్షించాల్సిందిగా ఆయన కోరారు.మధ్యంతర భృతిని తిరిగి వెనక్కి తీసుకోవడం దేశ చరిత్రలో ఎక్కడ జరగలేదన్నారు. హెచ్ఆర్ ఏ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆయన విమర్శించారు. సీఎస్ సహా అధికారుల కమిటీ ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
ఉద్యోగులకు ఇచ్చిన వాటిని వెనక్కి తీసుకోమని ఏ ముఖ్యమంత్రి చెప్పరని సూర్యనారాయణ అభిప్రాయపడ్డారు. సెంట్రల్ పే కమిషన్ ను ఏపీ లో అమలు చేస్తామంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర ప్రభుత్వానికి బదలాయిస్తుందా? అని ప్రశ్నించారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం అమలులో ఉన్న విషయాన్ని సూర్యనారాయణ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇల్లు అలకగానే పండగ అయిపోదన్నారు. ఉద్యోగులతో పెట్టుకున్న నాయకులు ఎవరినైనా ఇబ్బంది పడాల్సిందేనని ఆయన హెచ్చరించారు. ఇపుడు ప్రభుత్వానికి అవకాశం ఇస్తే భవిష్యత్ లో చాలా నష్టపోతామన్నారు.చీఫ్ సెక్రెటరీ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని సూర్యనారాయణ మండిపడ్డారు.