Ukraine Russia Crisis పోలెండ్, హంగేరీకి ఏపీ అధికారులు: విద్యార్ధుల తరలింపుపై జగన్ సర్కార్ నిర్ణయం
ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్ధులను స్వంత రాష్ట్రానికి రప్పించేందుకు గాను పోలెండ్, హంగేరీకి ఏపీ అధికారులను పంపాలని ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకొంది.
అమరావతి Ukraine లో చిక్కుకున్న Andhra Pradesh రాష్ట్రానికి చెందిన విద్యార్ధులను తరలించేందుకు Poland, Hungaryకి ఏపీ అధికారులు వెళ్లనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకొన్నారు.
ఉక్రెయిన్ దేశంలో వైద్య విద్యను అభ్యసించేందుకు Indiaతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున విద్యార్ధులు వెళ్తారు. ఉ(క్రెయన్ లో చిక్కుకున్న విద్యార్ధులతో గతంలోనే ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోన్ లో మాట్లాడారు.
ఏపి ప్రభుత్వం students రప్పించేందుకు ప్రయత్నిస్తోందని.. ప్రస్తుతం ఉక్రెయిన్ లో విమాన సర్వీస్‌లు రద్దయ్యాయని, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యార్థులకు సహాయం కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్ ని నియమించామని.. ఏపి భవన్‌లో అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి చెప్పారు. పరిస్థితులు చక్కబడగానే విద్యార్థులను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్ధులతో సంప్రదింపులు జరిపేందుకు గాను ఏపీ భవన్ లో ఇద్దరు అధికారులను నియమించింది జగన్ సర్కార్.రవి శంకర్,రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ గీతేష్ శర్మ ను నియమించింది ఏపీ సర్కార్.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం operation ganga పేరుతో స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ గగనతలం మూసివేసినందున అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తొలుత సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరి చేరుకునేలా సూచనలు చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నారు. ఈ ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలతో మరింత సమన్వయంతో వ్యవహరించేందుకు నలుగురు కేంద్ర మంత్రులను ప్రత్యేక దూతలుగా అక్కడి పంపాలని నిర్ణయం తీసుకుంది.కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా రొమేనియా, మాల్దోవాల నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరెన్ రిజిజు స్లొవేకియాకు, పెట్రోలియం మంత్రి హర్దీ్‌పసింగ్ పురి హంగరీకి, కేంద్ర రోడ్డు, రవాణా, విమానయాశ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ పోలండ్ వెళ్లారు.
మరోవైపు రష్యా దాడుల్లో మనదేశానికి చెందిన విద్యార్ధి మరణించడంతో భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ శాఖలకు కేంద్రం ఫోన్ చేసి తమ విద్యార్ధుల తరలింపునకు సహకరించాల్సిందిగా కోరింది.
భారతీయుల తరలింపు ప్రయత్నాల్లో భాగం పంచుకోవాలని ప్రధాని మోదీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు పిలుపునిచ్చారు. వైమానిక దళం యొక్క సామర్థ్యాలను ఉపయోగించుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఖాళీ చేయగలుగుతామని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే భారత వైమానిక దళం ఈరోజు నుంచి ఆపరేషన్ గంగాలో భాగంగా పలు C-17 విమానాలను అక్కడికి పంపారు.ఉక్రెయిన్ లో భారత్ తన ఎంబసీని మూసివేసింది. కీవ్ నగరాన్ని ఖాళీ చేయాలని భారతీయులకు కేంద్రం సూచించింది. భారతీయులను ఉక్రెయిన్ నుండి తరలించేందుకు చర్యలు తీసుకొంటుంది కేంద్రం. మరో వైపు ఇవాళ ఏపీ అధికారులు కూడ పోలెం, హంగేరీ దేశాలకు వెళ్లనున్నారు.