Asianet News TeluguAsianet News Telugu

కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్: రెగ్యులరైజేషన్ కు నిర్ణయం

కాంట్రాక్టు  ఉద్యోగులను  రెగ్యులరైజ్ చేయాలని  జగన్ సర్కార్  నిర్ణయం తీసుకున్నారు.  ఈ మేరకు  ఎల్లుండి  జరిగే  కేబినెట్  సమవేశంలో  ఈ విషయమై గ్రీన్ సిగ్నల్  ఇచ్చారు. 

AP Government Decides To Regularization Contract Employees lns
Author
First Published Jun 5, 2023, 9:30 PM IST

అమరావతి:  కాంట్రాక్టు  ఉద్యోగులకు  జగన్ సర్కార్  గుడ్ న్యూస్  తెలిపింది.  2014  జూన్   2వ తేదీ నాటికి  ఐదేళ్ల సర్వీస్ పూర్తి  చేసుకున్న   ఉద్యోగులను  క్రమబద్దీకరించనున్నట్టుగా  ఏపీ ప్రభుత్వం  తెలిపింది.  ఉద్యోగ సంఘాల నేతలతో  మంత్రివర్గ ఉపసంఘం  సోమవారంనాడు భేటీ అయింది.      ఉద్యోగుల సమస్యలపై  ఈ సమావేశంలో  చర్చించారు.

కాంట్రాక్టు  ఉద్యోగులను  క్రమబద్దీకరించనున్నట్టుగా  ఏపీ  ప్రభుత్వం  తెలిపింది.  సమావేశం ముగిసిన తర్వాత  ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  మీడియాకు  ఈ విషయం చెప్పారు.  ఈ నెల  7వ తేదీన  జరిగే  కేబినెట్ సమావేశం   కాంట్రాక్టు  ఉద్యోగుల  రెగ్యులరైజేషన్ కు ఆమోదం తెలపనున్నట్టుగా  మంత్రి బొత్స సత్యనారాయణ  చెప్పారు.ఈ విషయమై  త్వరలోనే  ఉత్తర్వులు  విడుదల  చేస్తామని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  తెలిపారు.

మరోవైపు  కొత్త పీఆర్‌సీ కమిటీని   నియమిస్తామని  మంత్రి బొత్స సత్యనారాయణ  చెప్పారు.  నూతన  పెన్షన్ విధానంపై  కూడా కేబినెట్ సమావేశంలో  చర్చించనున్నట్టుగా  మంత్రి బొత్స సత్యనారాయణ  వివరించారు.  డీఏ,  పీఆర్‌సీ  బకాయిలను  నాలుగేళ్లలో  16 వాయిదాల్లో చెల్లించనున్నట్టుగా మంత్రి  బొత్స  సత్యనారాయణ  తెలిపారు. 

గురుకులాల్లో  బోధనేతర  సిబ్బంది ఉద్యోగ విరమణ  వయస్సు  62 ఏళ్లకు  పెంచాలని నిర్ణయించినట్టుగా  మంత్రి చెప్పారు. వర్శిటీ  బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయస్సును  62 ఏళ్లకు  పెంచుతున్నామని  మంత్రి  తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios