Asianet News TeluguAsianet News Telugu

గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు: ఏపీ సర్కార్ నిర్ణయం

గృహ వినియోగదారులకు కూడా ఏపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగించనుంది. గృహ వినియోగదారులతో పాటు  కమర్షియల్, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడ  స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తారు.ఈ మేరకు ఏపీఈఆర్సీకి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. 

AP Government Decides to install Smart meters Domestic consumers
Author
First Published Oct 13, 2022, 2:05 PM IST

అమరావతి:  గృహ వినియోగదారులకు కూడా స్మార్ట్ మీటర్లను బిగించాలని కూడ ఏపీ ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు గురువారం నాడు జగన్  సర్కార్ ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదనలను పంపింది.

200 యూనిట్ల కంటే ఎక్కువగా  విద్యుత్ ను వినియోగించే గృహల్లో  స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు. గృహలతో పాటు కమర్షియల్ విద్యుత్ మీటర్లు,  ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఆర్డీ ఎస్ఎస్ పథకం కింద  ఈ స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు.  రెండు విడతలుగా ఈ స్మార్ట్ మీటర్లను వినియోగించనున్నారు.ఇప్పటికే వ్యవసాయ విద్యుత్ మోటార్లకు కూడా స్మార్ట్ మీటర్లుబిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన పథకం విజయవంతమైంది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లను వినియోగించడం వల్ల నాణ్యమైన విద్యుత్ ను అందిం,చే  అవకాశం నెలకొందని ప్రభుత్వం తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios