ప్రైవేట్లో కరోనా టెస్టులకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు: ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో చేసే పరీక్షలపై అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకొంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ విషయమై దృష్టి పెట్టింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో చేసే పరీక్షలపై అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకొంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ విషయమై దృష్టి పెట్టింది.
కరోనా బాధితులకు చేసే సిటీ స్కాన్, హెచ్ఆర్ సిటీ స్కాన్ ల పేరుతో చేసే దోపిడికి అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు సీటీ స్కాన్ ధరను నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఈ ధరలను ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు విడుదల చేసింది. సిటీ స్కాన్ లేదా హెచ్ఆర్ సిటీ స్కానింగ్ కు గరిష్టంగా రూ. 3 వేలను నిర్ణయించారు.
also read:శ్రీశైలంలో కుంభోత్సవం.. కఠిన మార్గదర్శకాలు విడుదల, నిబంధనలు పాటిస్తేనే అనుమతి
స్కానింగ్ సమయంలో వాడే పీపీఈ కిట్లు, మాస్క్ ,స్ప్రైడ్ షీట్లతో కలిపి ఈ ధరను నిర్ణయించామని ప్రభుత్వం తెలిపింది. స్కానింగ్ అనంతరం అనుమానితుల వివరాలను కోవిడ్ డాష్ బోర్డు వెబ్ సైట్లో తప్పక నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అన్నిజిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది.