విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్టును నియమించిన ఏపీ సర్కార్.. జీవో జారీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డును నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డును నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. 15 మంది సభ్యులతో దుర్గగుడి ట్రస్టు బోర్డును ఏర్పాటు చేసింది. ట్రస్టు బోర్డు సభ్యుల్లో.. కర్నాటి రాంబాబు, కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమనూరి కల్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, కొలుకులూరి రామసీత, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, వేదకుమారి ఉన్నారు. అలాగే ఎక్స్ అఫిషియో సభ్యునిగా దుర్గగుడి ప్రధాన అర్చకుడిని నియమిస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, కొత్త ట్రస్టు బోర్డు సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉండనునుంది.