అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. మావోయిస్టుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

సోమవారం నాడు ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టుల నియంత్రణ, మావోయిస్టులతో లింక్ ఉన్న సమస్యలపై ఈ కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది.    ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చైర్మెన్ గా ఉంటారు. ఈ కమిటీలో సభ్యులుగా హోం మంత్రి, గిరిజన, రెవిన్యూ,  ఆర్ అండ్ బి మంత్రులకు చోటు కల్పించారు.

లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంతో పాటు మావోల దాడుల్లో దెబ్బతిన్న ఆస్తులకు పునర్నిర్మించడం తదితర విషయాలపై కమిటీ చర్చించనుంది.