ఆంధ్రప్రదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో నిర్మాణంలో వున్న భవనాల అధ్యయనానికి కమిటీని నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన 9 మందితో కూడిన కమిటీ ఇందుకు సంబంధించి పని చేయనుంది. 

ఆంధ్రప్రదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో నిర్మాణంలో వున్న భవనాల అధ్యయనానికి కమిటీని నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన 9 మందితో కూడిన కమిటీ ఇందుకు సంబంధించి పని చేయనుంది. అమరావతిలోని అన్ని భవనాలపై అధ్యయనం చేసి ఏవీ అవసరమో తేల్చనుంది కమిటీ.

అలాగే భవనాలు పూర్తి చేయాలా..? ఖజానాపై భారం తగ్గించాలో నిర్ణయించనుంది. శాసన రాజధాని భవనాల నిర్మాణాన్నే పూర్తి చేసే యోచనలో జగన్ వున్నట్లుగా తెలుస్తోంది.

సెక్రటేరియేట్, హెచ్‌వోడీ, శాశ్వత హైకోర్టు భవన నిర్మాణాల కొనసాగింపుపై ప్రభుత నిర్ణయం కోరారు ఏఎంఆర్‌డీఏ కమీషనర్. హౌసింగ్ యూనిట్ల నిర్మాణం ఖర్చు తగ్గించే ప్లాన్‌కు సీఎస్ కమిటీని నియమించారు.