కోవిడ్‌తో మరణించిన వైద్యులకు రూ. 25 లక్షల పరిహారం: జీవో జారీ చేసిన ఏపీ సర్కార్
జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు జీవో జారీ చేసింది. కరోనాతో మరణించిన వైద్యులు, సిబ్బందికి ఎక్స్‌గ్రేషియాకు సంబంధించి జోవోను విడుదల చేసింది.
అమరావతి:జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు జీవో జారీ చేసింది. కరోనాతో మరణించిన వైద్యులు, సిబ్బందికి ఎక్స్‌గ్రేషియాకు సంబంధించి జోవోను విడుదల చేసింది. ఇటీవల కాలంలో జూనియర్ డాక్టర్లు పలు డిమాండ్లతో ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు.ఈ నోటీసులోని డిమాండ్లను అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఈ హామీ మేరకు ఇవాళ జీవోను విడుదల చేసింది ప్రభుత్వం.
కోవిడ్ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. స్టాఫ్ నర్సుకి రూ.20 లక్షలు, ఎఫ్‌ఎస్‌ఓ లేదా ఎమ్‌ఎస్‌ఓలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నారు. ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వులలో ప్రభుత్వం వెల్లడించింది. తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది