ముగ్గురు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, అజయ్ కల్లాం పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ తాజాగా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జూన్ వరకూ వీరు ముగ్గురు పదవుల్లో కొనసాగనున్నారు

ముగ్గురు ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలాన్ని ఏపీ సర్కార్ పొడిగించింది. వీరిలో సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, అజయ్ కల్లాం వున్నారు. ఈ ముగ్గురి పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ తాజాగా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వచ్చే ఏడాది జూన్ వరకూ వీరు ముగ్గురు పదవుల్లో కొనసాగనున్నారు. 

నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం గతేడాది జూన్‌ 18వ తేదీతో ముగిసింది. అప్పుడు కూడా మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. అలాగే ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం పదవీ కాలం కూడా అదే ఏడాది జూన్ 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది.