Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ ను కూల్చాలని తాపత్రయం: పవన్‌పై సజ్జల ఫైర్

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  సలహదారు సజ్జల  రామకృష్ణారెడ్డి విమర్శించారు. నెల రోజులుగా రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు  ప్రయత్నిస్తున్నారన్నారు.
 

AP  Government  Advisor Sajjala Ramakrishna Reddy Slams Pawan Kalyan
Author
First Published Nov 10, 2022, 1:54 PM IST

అమరావతి:జగన్ ప్రభుత్వాన్ని కూల్చాలని పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నారని ఏపీ రాష్ట్ర  ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారంనాడు తాడేపల్లిలో  మీడియాతో మాట్లాడారు.అధికారంలోకి రావాలన్నతాపత్రయంతోనే పవన్ కళ్యాణ్ ఇదంతా చేస్తున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.బయటకి పవన్ కళ్యాణ్ చేస్తున్నా ఆయన వెనుక  ఎవరున్నారో అందరికీ తెలిసిందేనన్నారు.

విశాఖ గర్జన రోజునే పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చారన్నారు. కావాలనే గందరగోళం సృష్టించారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబులు కలుసుకున్న అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్  లు కలవడం చారిత్రక అవసరం అనే పరిస్థితి సృష్టించారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.అధికారంలోకి రావాలన్నవక్రబుద్దితో ఇదంతా  చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఎందుకు కలవాలనుకొంటున్నారో  చెప్పగలరా అని ఆయన  ప్రశ్నించారు.చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు కలిసే ఉన్నారన్నారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేందుకు వీలుగా పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరమయ్యాడన్నారు. ఇప్పుడుప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా  ఉండేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నార్నారు.

నెలరోజులుగా  రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించాలని ఆయన ప్రజలను కోరారు.ఇప్పటంలో జనసేన సభకు స్థలం ఇచ్చిన వారిలో ఒక్కరి ఇళ్లు  కూడ కూల్చలేదని  సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇప్పటంలో పవన్ కళ్యాణ్ పర్యటన కంటే ముందు రోజే చంద్రబాబునాయుడు పై రాయితో  దాడి జరిగినట్టుగా డ్రామా ఆడారన్నారు. రాష్ట్రంలో ఏదో జరుగుతుందనే ప్రజలు అనుమానపడేలా ఈ ఘటనలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.   

also త్వరలోనే విశాఖ నుండి పాలన: సజ్జల కీలక వ్యాఖ్యలుread:

ఇప్పటంపై పవన్ కళ్యాణ్,టీడీపీ అనసవర   రాధ్దాంతం  చేస్తున్నారని  ఆయన విమర్శించారు. ఆక్రమణలను కూల్చాలా వద్దా అని  ఆయన ప్రశ్నించారు. ఇప్పటంలో పవన్ కళ్యాణ్  అంత ఆవేశం  ఎందుకు ప్రదర్శించారో అర్ధం కావడం లేదన్నారు.ఏమీలేని దాని గురించి సినిమా స్క్రిప్ట్ రాస్తున్నారని ఆయన  చెప్పారు.ఇప్పటంలో ఒక్క గోడ కూల్చలేదని  ఆయన  చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రతిరోజూ ధర్నాలు  జరిగేవన్నారు. చంద్రబాబు హయంలో మాయాబజారు సినిమాలు చూపించారని ఆయన   విమర్శించారు..చంద్రబాబు పాలన అంతా కరువేనన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios