ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఇచ్చిన నోటీసుపై జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్‌కు వివరణ ఇస్తూ ప్రవీణ్ లేఖ రాశారు.

వైఎస్సార్ లైఫ్ టైం అవార్డులు, గ్రామ సచివాలయాల విషయంలో అప్పటి సీఎస్ నిర్ణయాల మేరకే వ్యవహరించానని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. గ్రామ న్యాయాలయాల అంశాన్ని కేబినెట్ ముందుకు తీసుకురాని అంశాన్ని కూడా ఎల్వీకి వివరించానని ప్రవీణ్ వెల్లడించారు.

వివరణ పట్టించుకోకుండా షోకాజ్ నోటీసు ఇవ్వడం తనను తీవ్రంగా బాధించిందని.. ప్రజలకు సత్వర న్యాయం, లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం ఏపీ కేడర్‌కు ఉన్న ప్రత్యేకతని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.

సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్ఆర్.శంకరన్, ఏవీఎస్ రెడ్డి, యుగంధర్ వంటి వారి స్ఫూర్తితో ఏపీ కేడర్ పనిచేస్తుందన్నారు. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఎపిసోడ్ తెరపైకి రావడం బాధించిందని ప్రవీణ్ ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతా నిబంధనల ప్రకారమే చేశానని ఆయన లేఖలో పేర్కొన్నారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డులు, గ్రామ సచివాలయాలపై గత మంత్రివర్గ సమావేశం ఎజెండాలో పెట్టారు ప్రవీణ్ ప్రకాశ్.

అయితే ఆర్ధిక శాఖ అనుమతి తీసుకోకపోవడంతో పాటు తనకు చెప్పకుండా చేయటంపై ఎల్వీ సుబ్రమణ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో నిబంధనలు అతిక్రమించారంటూ ప్రవీణ్ ప్రకాశ్‌కు ఎల్వీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్లో లో నిన్నటి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ట్రాన్స్ఫర్ రాజకీయ దుమారానికి దారితీసింది. షోకాజ్ నోటీసు అందుకున్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ అనే ఒక సీఎం కార్యాలయ అధికారి ఏకంగా చీఫ్ సెక్రటరీనే  ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఉత్తర్వులివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక రకంగా పూర్తి అధికార వ్యవస్థ పైన, అధికారుల పైన నెగిటివ్ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. 

Also Read:ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ: జగన్‌కు భవిష్యత్తు ముప్పు?

వివరాల్లోకి వెళితే(దీంట్లో రాజకీయ కోణం ఏముంది అనేది పక్కన పెడితే), సీఎస్ హోదాలో ఎల్ వి సుబ్రహ్మణ్యం సీఎంఓ కార్యాలయ అధికారి అయినటువంటి ప్రవీణ్ ప్రకాష్ కి షోకాజ్ నోటీసు జారీ చేశాడు.

తర్వాత రాజకీయ పరిణామాలు ఏంటి అనేది పక్కన పెడితే, ప్రవీణ్ ప్రకాష్ ఏకంగా  షోకాజ్ నోటీసు జారీ చేసిన ఎల్ వి సుబ్రహ్మణ్యం ను అప్రాధాన్యమైన మానవ వనరుల శాఖకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశాడు. 

ఈ షాకింగ్ బదిలీ వల్ల మిగిలిన అధికారులలో ఒకింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన కార్యదర్శినే ఇంత అలవోకగా బదిలీ చేయగలిగితే, మా పరిస్థితి ఏంటి? సాధారణ అధికారులమైన మమ్మల్ని ఎలా పడితే అలా ట్రాన్స్ఫర్ కు గురి చేస్తారు కదా, అనే అనుమానం మాత్రం వారిలో కచ్చితంగా మొదలవుతుంది. 

Also read:సీఎస్‌గా నీలం సహాని వైపు జగన్ మొగ్గు: కేంద్రం చేతుల్లోనే

ఇదే తరహా బదిలీలు గనుక కొనసాగితే అధికారులు పూర్తి స్థాయిలో తమ శక్తిసామర్థ్యాల మేర ధైర్యంగా పని చేయగలుగుతారా? ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాము అని భయపడతూ స్వతంత్రంగా వ్యవహరించగలుగుతారా? అనే అనుమానాలు మాత్రం ఖచ్చితంగా ఉద్భవిస్తున్నాయి. 

దీనిలో ఉన్న మరో కోణం ఏంటంటే, చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి. దాంతోపాటు ఇతను రాష్ట్ర ప్రభుత్వం యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్.

మరో అంశం ఏంటంటే, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ బోర్డుకి చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను నియమించాలన్నా, ఆ ఉత్తర్వులను జారీ చేయాలన్నా అది చీఫ్ సెక్రటరీ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. 

సీనియర్ అధికారిని జూనియర్ అయినటువంటి ఒక సీఎం కార్యాలయ అధికారి ట్రాన్స్ఫర్ చేయడం ఇప్పుడు ఇక్కడ అసలు సమస్యగా మారింది. సాధారణంగా చీఫ్ సెక్రటరీ రాష్ట్రంలో ఉన్న అందరు ఐఏఎస్ అధికారులకు ఒక రకంగా బాస్ అని చెప్పవచ్చు. పరిపాలన విభాగంలో కూడా హెడ్. ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ కార్యాలయం మిగిలిన అన్ని కార్యాలయాల కన్నా పెద్దది.