కాంగ్రెస్ ను వీడుతానని అనుకోలేదు: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచించడం లేదని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఓటముల నుండి కాంగ్రెస్ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ను వీడుతానని తాను ఏనాడు అనుకోలేదని ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. శుక్రవారం నాడు న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తన తండ్రి నాలుగు సార్లు , తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినట్టుగా గుర్తు చేశారు. తన తండ్రి చాలా చిన్న వయస్సులో మరణించాడన్నారు.. ఆ సమయంలో పార్టీ మారితే తనకు సీటు ఇస్తామని ఆనాడు తనకు అవకాశం ఇచ్చారన్నారు. కానీ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినట్టుగా ఆయన చెప్పారు. 1952 నుండి తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడుతానని తాను ఏనాడూ అనుకోలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవడం లేదన్నారు. చేసిన తప్పులను కూడా కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వానికి అధికారం మాత్రమే కావాలన్నారు. ఓటముల నుండి కాంగ్రెస్ పార్టీ గుణపాఠాలు నేర్చుకోవడం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారని ఆయన అభిప్రాయపడ్డారు.
1980లో బీజేపీ ఆవిర్భవించిన సమయంలో ఆ పార్టీకి రెండు సీట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ రెండు సీట్లలో ఒకటి ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి, గుజరాత్ నుండి ఒక్క స్థానం మాత్రమేనని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
ఈ రెండు సీట్లలో ఒకటి ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి, గుజరాత్ నుండి ఒక్క స్థానం మాత్రమేనని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. 1980లో బీజేపీకి ఏడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఆనాడు కాంగ్రెస్ కు 45 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. కానీ ఇవాళ కాంగ్రెస్ 17 శాతం ఓట్లకు పడిపోయిందన్నారు. బీజేపీ సుమారు 40 శాతం ఓట్లకు ఎలా పెరిగిందో కాంగ్రెస్ నాయకత్వం ఆలోచించుకోవాలని ఆయన సూచించారు.
also read:బీజేపీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి క్షీణించిపోతుందన్నారు. బీజేపీ బలోపేతం ఎలా అవుతుందనే విషయమై కాంగ్రెస్ నాయకత్వంలో అంతర్మథనం లేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
మోడీ, అమిత్ షా డైరెక్షన్ లో బీజేపీ దేశంలో దూసుకుపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. పార్టీ నాయకత్వం ఏ బాధ్యతలు అప్పగించినా వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.