బీజేపీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో  చేరారు.  న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో  కిరణ్ కుమార్ రెడ్డి  బీజేపీ తీర్థం  పుచ్చుకున్నారు

AP  Former  Chief minister Nallari Kiran Kumar Reddy joins in BJp  lns

న్యూఢిల్లీ:   ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన  మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్  శుక్రవారంనాడు బీజేపీలో  చేరారు. బీజేపీలో  చేరడానిిక  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  నిన్ననే న్యూఢిల్లీకి  చేరుకున్నారు. ఇవాళ  ఉదయం  బీజేపీ జాతీయ కార్యాలయంలో  కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చివరి సీఎంగా  ఉన్నారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని  విభజించకుండా  చివరి నిమిషం వరకు  కిరణ్ కుమార్ రెడ్డి  ప్రయత్నించారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని  కిరణ్ కుమార్ రెడ్డి  ప్రకటించారు.  రాష్ట్ర విభజన  చేయవద్దని  కిరణ్ కుమార్ రెడ్డి    కాంగ్రెస్ నాయకత్వాన్ని  ఒప్పిందచే  ప్రయత్నం  చేశారు.  కానీ తెలంగాణ ఏర్పాటు కు  కాంగ్రెస్  పార్టీ కట్టుబడి ఉందని  ఆనాడు  యూపీఏ చైర్ పర్సన్  సోనియా గాంధీ  కిరణ్ కుమార్ రెడ్డి కి  చెప్పారు.

also read:న్యూఢిల్లీకి చేరుకున్న కిరణ్ కుమార్ రెడ్డి: నేడు బీజేపీలో చేరిక

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడంలో విఫలం కావడంతో సీఎం పదవికి, కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.  2014 ఎన్నికల్లో స్వంతంగా పార్టీని ఏర్పాటు  చేసి పోటీ చేశాడు.  కానీ కిరణ్ కుమార్ రెడ్డి  పార్టీ అభ్యర్ధులు ఒక్కరూ  కూడా విజయం సాధించలేదు.  ఆ తర్వాత  నాలుగు ఏళ్ల పాటు  రాజకీయాలకు దూరంగా  ఉన్నారు.  బీజేపీ నేతలు  ఆ సమయంలో  కిరణ్ కుమార్ రెడ్డితో సంప్రదింపులు చేశారు కానీ ఆయన  బీజేపీలో  చేరలేదు. ఉమెన్ చాందీ  కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇంచార్జీగా  బాధ్యతలు స్వీకరించిన  తర్వాత  కిరణ్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ లో  చేరారు.  కానీ కాంగ్రెస్ లో  పరిణామాలతో  కిరణ్ కుమార్ రెడ్డి  ఆ పార్టీకి దూరం కాాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ ఏడాది  మార్చి  12న   కిరణ్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా చేశారు.  ఇవాళ బీజేపీలో  చేరారు. 

దక్షిణాదిలో  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై బీజేపీ  కేంద్రీకరించింది. ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చే  ఎన్నికల్లో అధికారాన్ని కైవసం  చేసుకోవాలని బీజేపీ నాయకత్వం  వ్యూహాత్మకంగా ముందుకు  వెళ్తుంది. ఈ క్రమంలోనే  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని  బీజేపీలోకి ఆహ్వానించింది. బీజేపీ ఆహ్వానం  మేరకు  కిరణ్ కుమార్ రెడ్డి  ఆ పార్టీలో  చేరారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios