Asianet News TeluguAsianet News Telugu

దేశంలో బీజేపీకి ఎదురుగాలి: యనమల

ఏపీపై బిజెపికి కక్ష

Ap finance minister Yanamala   Ramakrishnudu reacts on By poll results

అమరావతి; నాలుగేళ్ళ బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న
ప్రజా వ్యతిరేక విధానాలకు ఉప ఎన్నికల్లో ప్రజలు
చెంపపెట్టులాంటి ఫలితాలను ఇచ్చారని  ఏపీ రాష్ట్ర ఆర్ధిక
శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

ఉప ఎన్నికల ఫలితాలపై  గురువారం నాడు అమరావతిలో
యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. 

 దేశ వ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని ఈ ఎన్నికల
ఫలితాలు తేటతెల్లం చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. 
గతంలో కూడ  రెండు ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నారని
ఆయన చెప్పారు. వరుస ఓటములపై బీజేపీలో ఆత్మ
విమర్శ కొరవడిందని తెలిపారు. కర్ణాటక ఎన్నికలతో
ప్రారంభమైన బీజేపీ పతనం.. ఇప్పుడు రెండో అంకం
ఉపఎన్నికల ఫలితాలతో తేలిందన్నారు. ఇక 2019
ఎన్నికలతో బీజేపీ ఓటముల పరంపర పూర్తవుతుందని
చెప్పుకొచ్చారు. మోదీ శకం 5 ఏళ్లకే ముగిసిపోతుందని
జోస్యం చెప్పారు.
 
 కేంద్రం ఇచ్చిన నిధుల గురించి మహానాడులో వివరించేసరికి బీజేపీ నాయకులకు వడదెబ్బ తగిలి దిమ్మ తిరిగిందన్నారు. ఆ దెబ్బ నుంచి  కోలుకునేందుకే హడావుడిగా తెలుగు రాష్ట్రాల్లో ధొలేరాపై యాడ్స్ గుప్పించారన్నారు.
 
ఏపీకి ఇచ్చిన నిధులు, పనులు అన్నీ కాగితాలకే పరిమితం
చేశారన్నారు. కేంద్రం నుండి టిడిపి బయటకు వచ్చిన
తర్వాత ఏపీపై బిజెపి మరింత కక్ష పెంచుకొందన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios