01:25 PM (IST) Feb 05

ప్రణాళికా విభాగానికి

రాష్ట్రాభివృద్ధి కోసం అవసరమయ్యే వివిధ ప్రణాళికలను రూపొందించే రాష్ట్ర ప్రణాళికా సంస్థకు రూ.1,403.17 కోట్లు .

01:22 PM (IST) Feb 05

మధ్యాహ్న భోజన పథకం

ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు గాను రూ. 156 కోట్లు

01:15 PM (IST) Feb 05

రియల్‌టైమ్ గవర్నెన్స్

రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రానికి రూ. 172 కోట్లు

01:14 PM (IST) Feb 05

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసేందుకు వీలుగా రూ. 1100 కోట్లు . 

01:14 PM (IST) Feb 05

ముఖ్యమంత్రి యువనేస్తం పథకం

ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రూ. 1200 కోట్లు

01:12 PM (IST) Feb 05

కాపుల సంక్షేమం

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపుల సంక్షేమం కోసం నెలకొల్పబడిన కాపు కార్పోరేషన్ నిమిత్తం రూ. 1000 కోట్లు

01:06 PM (IST) Feb 05

చేనత రంగం

రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రంగంపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు. ఈ రంగం తిరిగి గాడిన పడేందుకు గాను రూ. 225 కోట్లు 

01:05 PM (IST) Feb 05

రాష్ట్రంలో రైల్వే హెల్ప్ ‌లైన్

రాష్ట్రంలో రైల్వే హెల్ప్‌లైన్ ఏర్పాటు కోసం రూ. 180 కోట్లు

01:05 PM (IST) Feb 05

ఎన్‌ఆర్ఈజీఎస్

ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 1000 కోట్లు

01:03 PM (IST) Feb 05

రాజధాని ల్యాండ్ పూలింగ్ నిమిత్తం

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ కోసం రూ. 226 కోట్లు

01:02 PM (IST) Feb 05

డప్పు కళాకారులు, ఎయిడ్స్ రోగులకు పెన్షన్లు

* వయసు పైబడి జీవనాధారం కోల్పోయిన డప్పు కళాకారుల పెన్షన్ కోసం రూ. 108 కోట్లు

* ఎయిడ్స్ ‌వ్యాధిగ్రస్తుల పెన్షన్ల కోసం రూ. 100 కోట్లు 

01:00 PM (IST) Feb 05

వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు

* వృద్ధులు, వితంతువుల పెన్షన్ల నిమిత్తం రూ.10,401.05 కోట్లు

* వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 2,133.62 కోట్లు

12:58 PM (IST) Feb 05

వైశ్య కార్పోరేషన్

ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం నెలకొల్పిన వైశ్య కార్పోరేషన్‌కు రూన 50 కోట్లను కేటాయించారు.

12:57 PM (IST) Feb 05

బ్రాహ్మణ కార్పోరేషన్‌కు నిధులు

బ్రాహ్మణుల సంక్షేమానికి నెలకొల్పిన బ్రాహ్మణ కార్పోరేషన్‌కు రూ.100 కోట్లను కేటాయించారు

12:56 PM (IST) Feb 05

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సాయం

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే నిరుపేద విద్యార్ధుల కోసం ఉద్దేశించిన ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణకు రూ.100 కోట్లు

12:56 PM (IST) Feb 05

ఇమామ్ మౌజన్ కార్యక్రమానికి

ఇమామ్ మౌజన్ కార్యక్రమానికి రూ.100 కోట్లు

12:53 PM (IST) Feb 05

చంద్రన్న పెళ్లి కానుక

నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిఖర్చుల కోసం ఉద్దేశించిన చంద్రన్న పెళ్లికానుకకు గాను..

* చంద్రన్న పెళ్లి కానుక(బీసీ) లకు రూ. 175 కోట్లు

* చంద్రన్న పెళ్లి కానుక (ఎస్సీ)లకు రూ. 128 కోట్లు

12:53 PM (IST) Feb 05

అన్నాక్యాంటీన్లు

పేదవారికి రూ.5 కే భోజనాన్ని అందిస్తున్న అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు.

12:50 PM (IST) Feb 05

చంద్రన్న భీమా

చంద్రన్న భీమా పథకం కోసం రూ.354.02 కోట్లు

12:50 PM (IST) Feb 05

నిరుద్యోగ భృతి పెంపు

నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ. 1000 నిరుద్యోగ భృతిని రూ.2000కు పెంపు