వైసీపీ కుట్ర ఇదే, నాడు వైఎస్ఆర్ అన్యాయం: యనమల

Ap finance minister Yanamala Ramakrishnudu fires on Ysrcp
Highlights

వైసీపీపై యనమల ఘాటు వ్యాఖ్యలు


అమరావతి:బీసీలతో వైసీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 

సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. బీసీలకు గతంలో వైసీపీ ఏం చేయలేదన్నారు. భవిష్యత్తులో కూడ ఏం చేయబోదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలోనే  బీసీలకు అన్యాయం చేశారని ఆయన గుర్తు చేశారు.  బీసీలకు సంక్షేమ పథకాల్లో వైఎస్ కోత విధించారని ఆయన చెప్పారు. నాలుగేళ్ళలో టిడిపి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రూ.36 వేల కోట్లను ఖర్చు పెట్టిన విషయాన్ని ఆయన చెప్పారు.

బీసీలను టిడిపికి దూరం చేయాలనే కుట్రతోనే వైసీపీ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. వైసీపీ కుట్రలు సాగవని ఆయన అన్నారు.  బీసీలకు టీడీపి వల్లే న్యాయం జరిగిందని ఆయన చెప్పారు. అనేక మంది బీసీలు రాజకీయాల్లోకి రావడానికి టిడిపియే కారణమని ఆయన గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా బిజెపికి నెగిటివ్ ఓటింగ్ పెరుగుతోందన్నారు. యనమల రామకృష్ణుడు ఆరోపించారు. 

loader