AP Budget 2022 సంక్షేమానికి, నవరత్నాలకు పెద్ద పీట: బుగ్గన
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం నాడు ప్రవేశ పెట్టారు. రూ.2,56,256 కోట్లతో ఏపీ ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్ ను జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.
అమరావతి: రూ.2,56,256 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranath Reddy ఇవాళ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రెవిన్యూ వ్యయం 2,08,261 కోట్లు, రెవిన్యూ లోటు 17,036 కోట్లు,ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లు,మూల ధన వ్యయం 47,996 కోట్లుగా ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి ప్రకటించారు. AP Budget 2022 లో నవరత్నాలు, సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.
వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయించినట్టుగా ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.ఇంధన రంగానికి రూ. 10,281 కోట్లు, వ్యవసాయానికి రూ.11,387.69 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ. 1,568.83 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 20,962.06 కోట్లు, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖలకు రూ, 11,387 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 2,104 కోట్లు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10,201 కోట్లు, పర్యావరణ , అటవీ శాఖకు రూ., 685.36 కోట్లు కేటాయించినట్టుగా ఏపీ ఆర్ధిక మంత్రి ప్రకటించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు ఏపీ ఆర్ధిక సర్వేను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సర్వేలో ముఖ్యాంశాలను ఏపీ ప్రణాళిక కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వివరించారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో ఏపీ దేశ సగటు రేటు దాటిందని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ ప్రకటించారు. వ్యవసాయం రంగంలో 14.5 శాతం ప్రగతి నమోదు అయ్యిందన్నారు. సామాజిక, ఆర్థిక సర్వే 2021-22లో జీఎస్డీపీలో వృద్ధి రేటు బాగా పెరిగిందని తెలిపారాయన. పరిశ్రమల రంగంలో 25.5 శాతం, సేవా రంగంలో 18.9 శాతం ప్రగతి నమోదు అయ్యింది. తలసరి వృద్ధి రేటు కూడా రూ.31 వేలు పెరిగి.. 17.5 శాతం పెరిగింది. వివిధ సంక్షేమ పథకాల్లో ప్రగతి రావడంతో సుస్థిరాభివృద్ధి పెరిగిందని విజయ్ కుమార్ వెల్లడించారు.