Asianet News TeluguAsianet News Telugu

అప్పులపై ఆందోళన వద్దు.. టీడీపీది తప్పుడు ప్రచారం, తెలంగాణ బకాయిలపై మాట్లాడరే : బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

రాష్ట్ర అప్పులకు సంబంధించి టీడీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి . టీడీపీ నేతలే 4 లక్షల కోట్ల అప్పు అంటున్నారని.. 10 లక్షల కోట్లు అంటున్నారని ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రానికి సంబంధించినంత వరకు అప్పులపై ఎలాంటి దాపరికం లేదని బుగ్గన స్పష్టం చేశారు.  

ap finance minister buggana rajendranath reddy counter to tdp on state liabilities ksp
Author
First Published Nov 2, 2023, 2:32 PM IST

రాష్ట్ర అప్పులకు సంబంధించి టీడీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతల ఆరోపణల్లో అర్ధమే లేదన్నారు. ఈ మేరకు యనమల రామకృష్ణుడు ఆరోపణలను ఖండించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర అప్పులపై ఆందోళన వద్దన్న ఆయన.. గత ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని దుయ్యబట్టారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 

టీడీపీ నేతలే 4 లక్షల కోట్ల అప్పు అంటున్నారని.. 10 లక్షల కోట్లు అంటున్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు ఏమైనా అర్ధముందా అని బుగ్గన ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా అర్ధం లేని ఆరోపణలు చేయడం సరికాదని.. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు అప్పులపై ఎలాంటి దాపరికం లేదని బుగ్గన స్పష్టం చేశారు. టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నామన్నది అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios