కొత్త పీఆర్సీతో జీతాల తయారీకి ఏపీ సర్కార్ కసరత్తు:ఉద్యోగులు ఏం చేస్తారు?
కొత్త పీఆర్సీ జీవోల ఆధారంగా బిల్లులను అప్‌లోడ్ చేయాలని ఏపీ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బిల్లులను ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసకొంటామని కూడా ఆర్ధిక శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్: కొత్త PRC జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్న తరుణంలో కొత్త జీవోల ఆధారంగానే జీతాల చెల్లింపునకు సంబంధించి AP Government చర్యలు తీసుకొంటుంది. ఈ మేరకు Finance శాఖ ఇవాళ మరో సర్క్యూలర్ ను Treasuryకార్యాలయాలకు పంపింది. కొత్త పీఆర్సీ జీవోల మేరకు జీతాల బిల్లులను అప్‌లోడ్ చేసి ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామని ఆర్ధిక శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ విషయమై ఉద్యోగుల నుండి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులు మాత్రం కొత్త పీఆర్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కొత్త పీఆర్సీ అమలు చేసే సమయంలో సాధారణంగా పాత పీఆర్సీ ఇష్టమా, కొత్త పీఆర్సీ ప్రకారంగా జీతాలు తీసుకొంటారా అనే విషయమై ఉద్యోగుల నుండి ప్రభుత్వం ఆఫ్షన్ తీసుకొంటుంది. అయితే కొత్త పీఆర్సీని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.. ఉద్యోగుల ఆఫ్షన్ తీసుకోకుండా కొత్త పీఆర్సీ ఎలా అమలు చేస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
జనవరి మాసానికి పాత వేతనాన్ని ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కొత్త పీఆర్సీని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. HRA తగ్గింపుతో పాటు ఇతర అంశాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో విబేధిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. వచ్చే నెల 7వ తేదీ నుండి Stirke కు కూడా వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసకొన్నాయి. ఈ నెల 24న ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ ప్రభుత్వానికి సమ్ము నోటీసును కూడా ఇచ్చాయి.
అయితే కొత్త జీతాలను అందించేందుకు ఆర్ధిక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. కొత్త పీఆర్సీ మేరకు ఉద్యోగుల జీతాల బిల్లులను అప్‌లోడ్ చేయాలని DDAలకు ఆర్ధిక శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.జీతాలు, Pension బిల్లుల ప్రాసెస్ పై గడువు నిర్ధేశిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు , పెన్షన్ బిల్లులు ప్రాసెస్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బిల్లులు ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇవాళ సాయంత్రంలోపుగా బిల్లులను అప్ లోడ్ చేసి రేపటిలోపుగా ప్రాసెస్ చేయాలని కూడా ఆదేశించింది ఆర్ధిక శాఖ.
ఫిబ్రవరి 1 లోపుగా జీతాలు జమయ్యేలా చూడాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ట్రెజరీ ఉద్యోగులు కూడా ఈ బిల్లులు చేసేందుకు సిద్దంగా లేమని గతంలోనే ప్రకటించారు. అయితే ఉద్యోగ సంఘాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.
ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు. అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.