కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళీ. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చాలా మంచివాడని.. ఇప్పుడు ఇలా పిచ్చివాడు ఎందుకయ్యాడో అర్ధం కావడం లేదన్నారు.

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళీ. చంద్రబాబు కన్నా జగన్ లక్ష రెట్లు మంచోడని పోసాని ప్రశంసించారు. కర్ణుడు గొప్పవాడైనా దుర్యోధనుడి వైపు వెళ్లి దుర్మార్గుడయ్యాడని.. ఇప్పుడు పవన్ అదే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పవన్ గురించి తాను చాలా ఊహించుకున్నానని.. కానీ ఆయన రాజకీయాలు చూశాక పవన్ మీద గౌరవం పోయిందన్నారు. రాజకీయాల్లో కులాలు వద్దని చెప్పాలి లేదా మా కులానికే ఓట్లు వేయాలని అడగాలని కానీ పవన్ తీరు తనకు అర్ధం కావడం లేదని పోసాని చురకలంటించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చాలా మంచివాడని.. ఇప్పుడు ఇలా పిచ్చివాడు ఎందుకయ్యాడో అర్ధం కావడం లేదని పోసాని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడటం మానేయ్యాలని ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. చంద్రబాబు నీకన్నా గొప్పవాడా.. నీకంటే గొప్పవాడంటే నువ్వు రాజకీయాలకు పనికిరావని పోసాని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఓసారి ఓడిపో.. ఈసారి ఖచ్చితంగా గెలుస్తావ్, ఒంటరిగా పోరాడాలంటూ పవన్‌కు హితవు పలికారు. జగన్ ఏం మోసం చేశారో పవన్ చెప్పాలని కృష్ణ మురళీ డిమాండ్ చేశారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే .. పేర్ని నాని రెండు చెప్పులు చూపించారంటూ పోసాని ఎద్దేవా చేశారు. 

ALso Read: చంద్రబాబుకు చిరు సపోర్ట్ చేయనన్నాడు.. నువ్వేమో ఇలా, మీ జాతి సీఎం అవ్వొద్దా : పవన్‌పై పోసాని తీవ్ర వ్యాఖ్యలు

నీ దగ్గర మంచి మనుషులుంటే మంచి చెబుతారని.. జగన్ సీఎంగా ఎందుకు వుండకూడదో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. గెలవండి , ఓడిపోండి కానీ చంద్రబాబుకు సపోర్ట్ చేయడం ఎందుకని కృష్ణ మురళీ ప్రశ్నించారు. కాపు నేతల్ని మీరే తిడితే .. కాపు రిజర్వేషన్లు ఎప్పుడు రావాలని ఆయన నిలదీశారు. ఒకే విడతలో ఇన్ని మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి జగన్ తప్ప మరో వ్యక్తి లేడని పోసాని ప్రశంసలు కురిపించారు. దమ్ముంటే జగన్ అవినీతిని పవన్ నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు మాయలో పవన్ కల్యాణ్ పడ్డారని పోసాని వ్యాఖ్యానించారు. పవన్ తీరును మార్చుకోవాలని ఆయన సూచించారు.