ఏపీ ఫైబర్ నెట్ స్కాం: ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హైకోర్టులో సాంబశివరావు హౌస్ మోషన్ పిటిషన్

ఏపీ పైబర్ నెట్ కేసులో అరెస్టైన సాంబశివరావు ఆదివారం నాడు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయడంతో పాటు బెయిలివ్వాలని సాంబశివరావు కోరారు.ఈ పిటిషన్ పై రేపు విచారణ నిర్వహిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది.

AP fibernet scam:sambasivarao files house motion petition in AP High court


అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ కేసులో   అరెస్టైన సాంబశివరావు ఆదివారం నాడు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.చంద్రబాబునాయుడు సీఎం గా ఉన్న సమయంలో సాంబశివరావు ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  సంస్థ ఎండీగా పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సాంబశివరావు డిప్యూటేషన్ పై ఏపీలో పనిచేశారు. ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని జగన్  సర్కార్  ఆరోపించింది. ఈ మేరకు సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

also read:ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలో సాంబశివరావు అరెస్ట్.. కోర్టులో హాజరుపరచనున్న సీఐడీ

ఏపీ సీఐడీ సాంబశివరావును ఈ నెల 18వ తేదీన అరెస్ట్ చేసింది. దీంతో సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు.ఏపీ సీఐడీ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఆ పిటిషన్ లో  సాంబశివరావు కోరారు.అవినీతి నిరోధక చట్టం కింద అఖిల భారత సర్వీసు అధికారులపై కేసు నమోదు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ఆ పిటిషన్ లో సాంబశివరావు గుర్తు చేశారు.

48 గంటల పాటు పోలీసుల నిర్భంధంలో ఉంటే ఆ ఉద్యోగి సస్పెన్షన్ కు గురయ్యేందుకు అవకాశం ఉందని సాంబశివరావు తరపు న్యాయవాది ఆ పిటిషన్ లో కోరారు  సాంబశివరావుకు బెయిల్ ఇవ్వాలని కూడ ఆ పిటిషనర్ తరపు న్యాయవాద కోరారు. అయితే ఈ పిటిషన్ పై రేపు విచారణ జరుపుతామని ఏపీ హైకోర్టు తెలిపింది.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios