ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం : 19 మందిపై ఎఫ్ఐఆర్...

గత ప్రభుత్వం టెరా సాఫ్ట్ కు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టింది. రూ. 330 కోట్ల తొలిదశ ఆఫ్టికల్ ఫైబర్ గ్రిడ్ టెండర్లలో అవినీతి జరిగింది. వేమూరి, టెరాసాఫ్ట్, అప్పటి అధికారులపై కేసు నమోదయ్యింది. సుమారు రూ.2వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు అంచనా.

AP fiber grid scam : FIR registered againt 19 people

విజయవాడ : ఫైబర్ గ్రిడ్ టెండర్లలో మరోసారి అవినీతి బయటపడింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో 19 మందిపై సీఐడీ.. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ ను న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. సీఐడీ దర్యాప్తులో అక్రమాలు బట్టబయలయ్యాయి. 

గత ప్రభుత్వం టెరా సాఫ్ట్ కు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టింది. రూ. 330 కోట్ల తొలిదశ ఆఫ్టికల్ ఫైబర్ గ్రిడ్ టెండర్లలో అవినీతి జరిగింది. వేమూరి, టెరాసాఫ్ట్, అప్పటి అధికారులపై కేసు నమోదయ్యింది. సుమారు రూ.2వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు అంచనా.

బ్లాక్ లిస్టులోని కంపెనీకి గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఫోర్జరీ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ తో మోసం చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. 
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios