Asianet News TeluguAsianet News Telugu

కేఆర్ఎంబీ ఛైర్మెన్‌తో ఏపీ నీటి సంఘాల ప్రతినిధుల భేటీ: తెలంగాణపై ఫిర్యాదు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. ఏపీ నీటి సంఘాల ప్రతినిధులు గురువారం నాడు కేఆర్ఎంబీ ఛైర్మెన్ తో భేటీ అయ్యారు. తెలంగాణ సర్కార్ తీరుపై  ఏపీ సాగునీటి సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

AP farmers meeting with KRMB chairman at his office lns
Author
Guntur, First Published Jul 15, 2021, 3:01 PM IST

అమరావతి: కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)  ఛైర్మెన్  ఎంపీ సింగ్ తో  ఏపీ నీటి సంఘాల ప్రతినిధులు  గురువారం నాడు భేటీ అయ్యారు.హైద్రాబాద్‌ జలసౌధలో ఏపీ  నీటి సంఘాల ప్రతినిధులు కేఆర్ఎంబీ ఛైర్మెన్ తో భేటీ అయ్యారు.కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రతినిధులు ఆయనతో సమావేశమయ్యారు.

 తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కేఆర్ఎంబీకి ఏపీ నీటి సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.  కృష్ణా నదిపై నిర్మించిన ఉమ్మడి ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జల విద్యుత్ ను ఉత్పత్తి చేసింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండకుండా నీరంతా వృధాగా సముద్రంలోకి వెళ్లిందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. 

also read:కేసీఆర్‌కి షాక్: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీలో ఏపీ రైతుల పిటిషన్, కమిటీ

ఈ విషయమై కేఆర్ఎంబీకి కూడ ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడాన్ని పరిష్కరించాలని ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి, కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు లేఖలు రాశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఈ విషయమై కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios