తాడేపల్లిగూడెం: మాజీ కేంద్రమంత్రి, సినీహీరో చిరంజీవి బీజేపీలో చేరితే స్వాగతిస్తామని తెలిపారు మాజీమంత్రి మాణిక్యాలరావు. మెగాస్టార్ చిరంజీవి లాంటి ఉన్నతమైన విలువలు ప్రజాదరణ కలిగిన నేతలు బీజేపీలోకి వస్తే స్వాగతించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 

తాను చిరంజీవితో ఎలాంటి చర్చలు జరపలేదని, ఇప్పటి వరకు మాట్లాడలేదన్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడుగా చిరంజీవి ఉన్నారని అలాంటి వ్యక్తి బీజేపీలోకి వస్తే రెడ్ కార్పెట్ వేస్తామని తెలిపారు. 

ఇకపోతే చిరంజీవికి ఏపీలో విశేష ఆదరణ ఉందని, అన్ని వర్గాల ప్రజలు చిరంజీవిని అభిమానిస్తుంటారని మాణిక్యాలరావు తెలిపారు. చిరంజీవి ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉందని అందువల్ల ఆయన బీజేపీలోకి వస్తే మంచిదేనన్నారు. 

ఇకపోతే చిరంజీవి కాషాయి గూటికి చేరుతారంటూ వార్తలు పొలిటికల్ జంక్షన్లో చక్కెర్లు కొడుతున్నాయి. బీజేపీలో చేరాలని కొంతమంది కీలక నేతలు చిరంజీవితో సంప్రదింపులు జరిపేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

చిరంజీవి బీజేపీలో చేరితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు కీలకమైన పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మరి చిరంజీవి బీజేపీలో చేరతారా లేక సినీనటుడుగానే కొనసాగుతారా అన్నది వేచి చూడాలి. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ రాజకీయాల్లో భారీ కుదుపు, చంద్రబాబుతో సహా 150 గల్లంతే: మాజీమంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు