తాడేపల్లి గూడెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో ఓ కుదుపు రాబోతుందని మాజీమంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయిపోయే అవకాశం ఉందన్నారు. 

2024 లోపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా 150 మంది కీలక రాజకీయ నేతలు కనుమరుగు అయ్యే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ నేతలు సైతం బీజేపీలో చేరతారని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం దిశగా ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఏపీలో యువత బీజేపీవైపు ఆసక్తిగా చూస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏపీలో బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కావడంతోపాటు బలమైన ప్రత్యామ్నాయ పార్టీగా మారబోతుందని మాణిక్యాలరావు స్పష్టం చేశారు.