అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లనున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరనున్నారు. 

ఈనెల 28 నుంచి 31 వరకు అమెరికాలోనే ఉండనున్నారు. అనంతరం ఆగష్టు 1న రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి ఆయన హైదరాబాద్ బయలు దేరారు. శనివారం కుటుంబ సభ్యులతో గడిపి ఆదివారం అమెరికా పయనం కానున్నారు.