అమరావతి: మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కొడుకు వెంకట సురేష్  కోసం ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సురేష్ హైద్రాబాద్ లో ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన కోసం ఏసీబీ బృందం హైద్రాబాద్ కు వచ్చింది.

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ ను  ఏసీబీ అధికారులు శుక్రవారం నాడు ఉదయం అదుపులోకి తీసుకొన్నారు. మరో వైపు సురేష్ కోసం కూడ గాలింపు చర్యలు చేపట్టారు.

also read:నిన్న హైకోర్టులో బెయిల్ పిటిషన్: పితాని మాజీ పీఎస్‌ను అదుపులోకి తీసుకొన్న ఏసీబీ

 పితాని సత్యనారాయణ మంత్రిగా ఉన్న సమయంలో  కొన్ని మందుల కంపెనీల నుండి మందులు కొనుగోలు చేసేందుకు సురేష్ సిఫారసు చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. అయితే ఈఎస్ఐ స్కాంలో గతంలో తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వివరణ ఇచ్చారు. ఈఎస్ఐ స్కాంలో తమ పాత్ర లేదని ఆయన తేల్చి చెప్పారు. 

అయితే ముందస్తు బెయిల్ కోసం పితాని సురేష్, మాజీ పీఎస్ మురళీమోహన్ లు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈ విషయమై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.