అమరావతి: ఏపీ ఈఎస్ఐ స్కాంలో నిందితుడు ప్రమోద్ రెడ్డి  ఏపీ హైకోర్టులో గురువారంనాడు లొంగిపోయాడు.కోర్టు బెయిల్ నిరాకరించడంతో ప్రమోద్ రెడ్డి కోర్టులో లొంగిపోయాడు. 

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రమోద్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్టు బెయిల్ కు నిరాకరించింది. దీంతో హైకోర్టులోనే ఆయన లొంగిపోయాడు.

 

ఏసీబీ అధికారులు ప్రమోద్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

ఏపీ ఈఎస్ఐ లో రూ. 150 కోట్ల కుంభకోణం చోటు చేసుకొందని ఏసీబీ గుర్తించింది.ఈ కేసులో మాజీమంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురిని ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ప్రమోద్ రెడ్డిని అరెస్ట్  చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ఏసీబీకి చిక్కలేదు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. కానీ బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన ఇవాళ లొంగిపోయాడు.