Asianet News TeluguAsianet News Telugu

శ్రీశైలం ఆలయంలో కుంభకోణం: మంత్రి వెల్లంపల్లి సీరియస్, దర్యాప్తుకు ఆదేశం

శ్రీశైల క్షేత్రంలో  అవినీతి, ఆర్థిక అవకతవకలపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే ఆయన కర్నూలు ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు

ap endowment minister vellampalli srinivas serious on rs1-80 crore misuses in srisailam temple
Author
Srisailam, First Published May 25, 2020, 8:02 PM IST

శ్రీశైల క్షేత్రంలో  అవినీతి, ఆర్థిక అవకతవకలపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే ఆయన కర్నూలు ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు.

తక్షణమే రికవరీ చేయాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రత్యేక దర్యాప్తు అధికారిని నియమించి.. సైబర్ ఎక్స్‌పర్ట్ ద్వారా విచారణ చేపట్టాలని, ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్, అవినీతి కుంభకోణంపై నివేదిక ఇవ్వాలని దేవాదాయ శాఖ కమీషనర్‌ను వెల్లంపల్లి ఆదేశించారు.

కాగా... శ్రీశైల మల్లన్న దర్శనం కోసం రూ. 150 టిక్కెట్ల కొనుగోలులో రూ. 1.80 కోట్లు మాయమైనట్టుగా ఆలయ అధికారులు గుర్తించారు. రూ. 1500 అభిషేకం టిక్కెట్లలో రూ. 50 లక్షలు మాయమయ్యాయి.

Also Read:సాఫ్ట్‌వేర్ మార్చి శ్రీశైలం దేవాలయంలో కోట్లు స్వాహా: ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న ఈవో

భక్తులు ఇచ్చిన విరాళాల్లో సుమారు కోటి రూపాయాలు  అక్రమార్కుల పాలయ్యాయి. అదే విధంగా భక్తులకు ఇచ్చిన అకామిడేషన్లకు సంబంధించి విషయాల్లో కూడ రూ. 50 లక్షలు మాయమయ్యాయి.

500 టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టిక్కెట్లలో కూడ రూ. 50 లక్షలు మాయమైనట్టుగా ఈవో తెలిపారు. ఒక్కొక్క అవినీతి బయటపడడంతో ఉద్యోగులు పరస్పరం ఈవోకు ఫిర్యాదు చేశారు. 

Also Read:టీటీడీ ఆస్తులను అమ్మడం లేదు... ఎన్ని నిందలు వచ్చినా తట్టుకుంటా: వైవీ సుబ్బారెడ్డి

ఆలయంలో అవినీతి జరిగిందని ఈవో కేఎస్ రామారావు చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆయన ప్రకటించారు. స్వామి వారికి భక్తులు ఇచ్చిన విరాళాలే కాదు టిక్కెట్ల కొనుగోలు ద్వారా వచ్చిన ఆదాయం కూడ అక్రమార్కుల జేబుల్లోకి చేరింది.

లాక్ డౌన్ దెబ్బకు ఆలయానికి భారీగా ఆదాయం తగ్గిపోయింది. ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపుల విషయంలో పాలక మండలి ఇబ్బందులు పడుతోంది. అయితే దేవాలయ ఆదాయాన్ని అక్రమార్కులు తమ జేబుల్లోకి మళ్లించుకొన్న విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios