Asianet News TeluguAsianet News Telugu

పీఆర్సీపై ఏపీ సీఎస్ కమిటీ నివేదిక: ఉద్యోగ సంఘాల అసంతృప్తి

ఏపీ సీఎస్ సీఎం కు అందించిన పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు.సీఎంతోనే ఈ విషయమై తాడో పేడో తేల్చుకొంటామని ప్రకటించారు. తమ డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. 

AP Employees union leaders unhappy Chief Secretary Sameer Sharma Report on PRC
Author
Guntur, First Published Dec 13, 2021, 8:41 PM IST

అమరావతి: prc పై సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ Bopparaju  సహా Employees Union నేతలు సోమవారం నాడు రాత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ స్కేల్ ను కమిటీ అధ్యయనం చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. Chief Secretary నేతృత్వంలోని కమిటీ సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ప్రకటించారు.

also read:పీఆర్సీపై 72 గంటల్లో సీఎం ప్రకటన, 11 ప్రతిపాదనలు: ఏపీ సీఎస్ సమీర్ శర్మ

తమ డిమాండ్లపై సీఎం Ys Jagan చొరవ తీసుకొని పరిష్కరించాలని  వారు డిమాండ్ చేశారు. ఈ నివేదికపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు ఓ కమిటీని ఏర్పాటు చేసుకొన్నట్టుగా తెలిపారు. సీఎంతోనే  ఈ విషయమై చర్చిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. Sameer Sharma కమిటీ సిఫారసుల ప్రకారంగా తమకు పెద్దగా ఉపయోగం లేదని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. తమ డిమాండ్ల సాధనకు సీఎం పెద్ద మనసు చేసుకోవాలని వారు కోరారు. 11వ వేతన సంఘం సిఫారసుల్లో కొన్నింటిని సీఎస్ కమిటీ పక్కన పెట్టిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios