పీఆర్సీపై 72 గంటల్లో సీఎం ప్రకటన, 11 ప్రతిపాదనలు: ఏపీ సీఎస్ సమీర్ శర్మ


పీఆర్సీ పిట్ మెంట్ పై  సుమారు 11 అంశాలను ప్రతిపాదించామని ఏపీ సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. అయితే 14.29 శాతం ఫిట్‌మెంట్ ను సీఎస్ కమిటీ సిఫారసు చేసింది. తాము ప్రతిపాదించిన సిఫారసులతో ప్రభుత్వంపై సుమారు 8 నుండి 10 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు సీఎస్

YS Jagan will be announced within 72 hours on PRC Pitment  Says Sammer Sharma

అమరావతి: పీఆర్సీ ఫిట్‌మెంట్ పై సీఎం జగన్ ప్రకటిస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తెలిపారు. మరో 72 గంటల్లో ఈ విషయమై సీఎం జగన్  ప్రకటన చేసే అవకాశం ఉందని సీఎస్ సమీర్ శర్మ వివరించారు. Prc నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Sameer Sharma సోమవారం నాడు సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో సీఎం Ys Jagan ను కలిసి అందించారు. అనంతరం సోమవారం నాడు రాత్రి ఆయన  సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అనేక అంశాలను కార్యదర్శుల కమిటీ సిఫారసు చేసిందన్నారు.పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందిస్తామని సమీర్ శర్మ తెలిపారు. ఈ మీడియా సమావేశం పూర్తైన గంట తర్వాత ఆర్ధిక శాఖ వెబ్‌సైట్‌లో పీఆర్సీ నివేదికను అప్‌లోడ్ చేస్తామన్నారు. అంతేకాదు Employees union  నేతలను పీఆర్సీ నివేదికను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తెలిపారు.పీఆర్సీ ఫిట్‌మెంట్ పై సీఎం జగన్ కు 11 ప్రతిపాదనలను అందించినట్టుగా సీఎస్ సమీర్ శర్మ చెప్పారు.ఇతర రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన ఫిట్‌మెంట్ లను పరిశీలించామని ఆయన వివరించారు. తాము ప్రతిపాదించిన సిఫారసులను అమలు చేస్తే  ప్రభుత్వంపై సుమారు 8 నుండి 10 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని సీఎస్ సమీర్ శర్మ తెలిపారు.

also read:AP PRC: ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్... సాయంత్రమే ఉద్యోగసంఘాల చేతికి పీఆర్సీ నివేదిక (Video)

పీఆర్సీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశుతోష్ మిశ్రా  ఏడాది క్రితమే నివేదికను ఇచ్చింది. పీఆర్సీ నివేదిక ఇంకా ఉద్యోగ సంఘాలకు చేరలేదు.  ఇవాళ ఉద్యోగ సంఘాలను పీఆర్సీ కమిటీ నివేదికను అందించనున్నారు. పీఆర్సీ ఫిట్‌మెంట్ పై కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పీఆర్సీపై నవంబర్ 12న జాయింట్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వం పీఆర్సీపై స్పష్టత ఇవ్వలేదు.

ఉద్యోగుల సమస్యలపై సంప్రదింపులకు ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఏడాది అక్టోబర్ 29న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. అయితే వారంలో పీఆర్సీ నివేదికను విడుదల చేస్తామని సీఎస్ సమీర్ శర్మ హమీ ఇచ్చారు. అయితే ఇంతవరకు పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందించలేదు. ఈ నెల 3న కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

పీఆర్‌సీపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో ఈ అంశాన్ని సెటిల్‌ చేయాలని Employees Union నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఉద్యోగులకు, రిటైర్డ్‌ సిబ్బందికి రావలసిన కోట్లాది రూపాయలు పెండింగ్‌ నిధుల విడుదలపై కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. 2018 జూలై 1 నుంచి పీఆర్‌సీ సిఫారసులను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ తేదీకి ఒక్క రోజు తక్కువైనా అంగీకరించమన్నారు. అయితే  ఈ నెల 7 నుంచి తమ ఉద్యమం ప్రారంభం అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. అయితే ఈ నెల 3న  తిరుపతిలో సీఎం జగన్ ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలకు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. 10 రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీకి అనుగుణంగానే పీఆర్సీపై కార్యదర్శుల కమిటీ నివేదికను ఇచ్చింది. ఈ నివేదికపై సీఎం జగన్ 72 గంటల్లో పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.


సీఎస్ కమిటీ సిఫారసు చేసిన ముఖ్యాంశాలు

 సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ  14.29  శాతం ఫిట్‌మెంట్ ను సీఎస్ నేతృత్వంలోని  కార్యదర్శుల కమిటీ నివేదికను అందించింది. 

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులపై కూడా నివేదికలో కూడా పలు అంశాలను పొందుపర్చింది కమిటీ.

2018-19లో జీతాలు, పెన్షన్ల రూపంలో రూ.52,513 కోట్లు ఖర్చు.

2020-21 నాటికి ఉద్యోగుల జీతాలు,పెన్షన్ల వ్యయం రూ. 67,340 కోట్లకు చేరిందని తెలిపిన కార్యదర్శుల కమిటీ.

2018-19లో  రాష్ట్ర ప్రభుత్వం స్వంత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తానికి 84 శాతం ఖర్చు చేయాల్సి వచ్చిందన్న కమిటీ.

2020-21  నాటికి ఈ వ్యయం 111 శాతానికి చేరుకొంటుందని కమిటీ అభిప్రాయపడింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios