Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ప్రభుత్వోద్యోగుల ఖాతాల్లోంచి డబ్బులు మాయం... ఆర్థిక శాఖ అధికారులు ఏమంటున్నారంటే..

ప్రభుత్వ ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాల్లోంచి డబ్బులు మాయం అవడంతో ఉద్యోగసంఘాలు సీరియస్ అవుతున్నాయి. ఉద్యోగ సంఘాల నాయకులు ఇవాళ ఆర్థిక శాఖ అధికారులను కలిసి దీనిపై నిలదీసారు. 

AP Employees union leader serious on cash withdraw in employees gpf accounts
Author
Amaravati, First Published Jun 29, 2022, 4:06 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాల నుండి డబ్బులు మాయమవడంపై వివాదాస్పదమవుతోంది. వివిధ జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతానుండి డబ్బులు విత్ డ్రా అయినట్లు మెసేజ్ లు వచ్చాయి. ఇలా ఉద్యోగుల ఖాతాలో జమచేసిన దాదాపు రూ.800 కోట్లు విత్ డ్రా అయినట్లు ఉద్యోగసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో ఏపీ ఆర్ధికశాఖ స్పెషల్ సిఎస్ రావత్, సత్యనారాయణ ను ఏపి ఉద్యోగసంఘాల జేఎసి,  అమరావతి ఉద్యోగ సంఘాలు ఏపీ ఆర్ధికశాఖ స్పెషల్ సిఎస్ రావత్, సత్యనారాయణల ను కలిసారు. 

ఈ సందర్భంగా ఏపీ జేఏసి ఛైర్మన్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ... ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములు మాయంపై ఆర్థిక అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు. ఉద్యోగుల జిపిఎస్ ఖాతాలనుండి డబ్బులు మాయం వెనక కారణమేంటో తెలపాలని కోరామన్నారు. అయితే ఇది ఎలా జరిగిందో తెలియడం లేదని అధికారులు అంటున్నారని బండి శ్రీనివాస్ తెలిపారు. 

కింది స్థాయి అధికారుల నుండి రిపోర్ట్ తెప్పించుకుని పరిశీలిస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపినట్లు శ్రీనివాస్ వెల్లడించారు. డబ్బులు వేసి తీసేయడం టెక్నికల్ సమస్యగా కనిపిస్తోందని... అసలు ఏం జరిగిందో తెలుసుకుంటామని అధికారులు తెలిపారన్నారు.  సాయంత్రం మరోసారి సమావేశం ఏర్పాటుచేసి అన్ని విషయాలు చెబుతామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పినట్లు బండి శ్రీనివాస్ తెలిపారు. 

read more  ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయం.. మొత్తం రూ.800 కోట్లు

ఏపి జెఏసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ... జిపిఎఫ్  ఖాతాలో డబ్బుల మాయమవడంతో నిన్నటి నుండి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. డబ్బులు క్రెడిట్ అయి మరల డెబిట్ కావడంతో ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారని... గతేడాది కూడా ఇలాగే జరిగిందని గుర్తుచేసారు. మళ్లీ ఇప్పుడిలా ఉద్యోగుల ఖాతాల్లోంచి డబ్బులు ఎందుకు డెబిట్ అయ్యాయో ఆర్థిక శాఖ అధికారులను అడిగినట్లు బొప్పరాజు తెలిపారు. 

ఇలా డబ్బులు ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాలో క్రెడిట్, డెబిట్ కావడానికి సిఎప్ఎంఎస్ ప్రాబ్లం కావచ్చని... దీనిపై డెరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ ను వివరణ కోరినట్లు అధికారులు తెలిపారన్నారు.  2018 లో డిఏ ఎరియర్స్ వేశామమన్నారు... అయితే అది ఇప్పటికీ రాలేదని... 2019 డిఏ ఎరియర్స్  జివో ఇంకా జిపిఎఫ్ లో క్రెడిట్ అవ్వలేదని చెప్పామన్నారు. ఈ  రెండు ఇచ్చి ఉంటే ఎప్పడు ఇచ్చారో క్లారిటీ ఇవ్వాలని కోరినట్లు బొప్పరాజు తెలిపారు. 

2022 లో కేంద్ర ప్రభుతవం డిఏ ఇచ్చిందని అడగ్గా దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడి చెపుతామని అధికారులు చెప్పారన్నారు. ఇంకా అదనంగా జిపిఎఫ్ లోన్లు, సరెండర్ లీవ్ లు, డిఏ ఎరియర్స్ ఎప్పటివరకు ఇస్తారని ఆర్థిక శాఖ అదికారులను అడిగామన్నారు. 2022 ఏప్రిల్ వరకు మొత్తం పెండింగ్ బిల్లులు ఇస్తామన్నారని గుర్తుచేయగా....  వచ్చే నెలాఖరుకు మొత్తం ఇస్తామని అధికారులు అంటున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 

ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ... అకౌంట్ జనరల్ కార్యాలయం నెట్ లో ఉంచిన వివరాల మేరకు జీపిఎఫ్ ఖాతాలో రూ.800 కోట్లు మాయం అయ్యాయని భావిస్తున్నామన్నారు. దీని గురించి మాట్లాడేందుకు ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడేందుకు నిన్ననే ప్రయత్నించామన్నారు. ఇవాళ ఉద్యోగుల ఖాతాలో డబ్బుల మాయంపై అధికారులు ఇచ్చిన వివరణపై సంతృప్తిగా లేమన్నారు. ఉద్యోగుల అనుమతి లేనిద డిఏ సొమ్ము మార్చే నెలలో డెబిట్, క్రెడిట్ కాలేదని... అంతకు ముందు ఏడాది పడ్డ సొమ్ము మార్చిలో తీసేసారని అన్నారు. ఇది క్రిమినల్ చర్య గా తీసుకోవాల్సిన అంశమని... ఉద్యోగుల అకౌంట్ ను అనధికారికంగా హ్యాకింగ్ చేయడమేనని అధికారులకు చెప్పినట్లు సూర్యనారాయణ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios