Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో రీపోలింగ్: కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేది సిఫారసు

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా భారీగా అక్రమాలు జరిగాయంటూ తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని...కొన్ని చోట్ల మాత్రమే కాస్త గందరగోళం చోటుచేసుకుందని అంటున్నారు. వివిధ కారణాలతో గందరగోళం చోటుచేసుకున్న పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించడానికి తాము సిద్దంగా వున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. 

ap election commission wants to conduct repolling in some polling booths
Author
Amaravathi, First Published Apr 17, 2019, 8:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా భారీగా అక్రమాలు జరిగాయంటూ తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని...కొన్ని చోట్ల మాత్రమే కాస్త గందరగోళం చోటుచేసుకుందని అంటున్నారు. వివిధ కారణాలతో గందరగోళం చోటుచేసుకున్న పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించడానికి తాము సిద్దంగా వున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు పోలింగ్ బూతుల్లో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడాని చర్యలు తీసుకుంటున్నట్లు ద్వివేది వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు తమకు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ఐదు పోలింగ్ బూతుల్లో తలెత్తిన సమస్యలు, రీపోలింగ్ అవసరాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశామని...అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు ఆయన వెల్లడించచారు.

గుంటూరు జిల్లా నరసరావు పేట అసెంబ్లీ నియోజకవర్గం కేసన పల్లిలోని 94, గుంటూరు పశ్చిమ నియోజకర్గం నల్లచెరువు 244, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కలనూతలలోని 247, నెల్లూరు జిల్లా సుళ్లూరు పేట అటకానితిప్పలోని 197, నెల్లూరు అసెంబ్లీ పల్లెపాలెం ఇసుకపల్లి 247 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ చేపట్టాల్సిన అవసరం వుందని ఈసీఐకి సిపార్సు చేసినట్లు ద్వివేది తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios