ఎన్నికలకు సంబంధించిన సమస్యలు, ఇబ్బందులను 0866 2466877 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్ఈసీ వెల్లడించింది. 

విజయవాడ: పంచాయితీ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ ను ఏర్పాటయ్యింది. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఈ కాల్ సెంటర్ ను ఏర్పాటుచేశారు. ఎన్నికలకు సంబంధించిన సమస్యలు, ఇబ్బందులను 0866 2466877 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్ఈసీ వెల్లడించింది. ఇప్పటికే కాల్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయన్న ఎస్ఈసీ తెలిపింది.

ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదు నమోదు చేయాలని కాల్ సెంటర్ సిబ్బందికి ఆదేశించింది ఎస్ఈసీ. ఫిర్యాదు తీవ్రత మేరకు వెంటనే సంబంధిత అధికారికి పంపాలని సూచించింది. కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్‌వోలకు ఫిర్యాదులు పంపాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఈ కాల్ సెంటర్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ నిరంతరం పర్యవేక్షించనున్నారు.

read more ఏపీ పంచాయతీ ఎన్నికలు: రెండో విడతలో ఏకగ్రీవాలివే.. గుంటూరు టాప్..!!

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్‌ను నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పొడిగించింది. ఎస్ఈసీ యాప్‌పై ఈ నెల 17 వరకు స్టే పొడిగిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నిఘా లేదా సీ. విజిల్ యాప్ వినియోగించుకోవచ్చని ఎస్ఈసీకి కోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించి 17న విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించింది. 

కాగా, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సీ విజిల్ యాప్ ఇప్పటికే ఉండగా, మళ్లీ కొత్తగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో యాప్ తీసుకురావడం సరికాదని, దీనిపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు ఈ వాచ్ యాప్ మీద విచారణ జరిపింది. దీనికి భద్రతా పరమైన అనుమతులు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

దీనికి మరో 5 రోజుల్లో భద్రాపరమైన అనుమతులు వస్తాయని వాదించారు. దీంతో ఈ వాచ్ యాప్‌ను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9 వరకు యాప్‌ను అమల్లోకి తీసుకురావొద్దని స్పష్టం చేసింది. తాజాగా మరో వారం ఈ యాప్ పై స్టే ను పొడిగించింది.