ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో కొత్త పథకాలకు బ్రేక్ పడింది. అమ్మబడి పథకంతో పాటు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోయింది.

అయితే అమ్మఒడి పథకం ఆగదని స్పష్టం చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. జనవరి 11వ తేదీన అమలు జరపాలని నిర్ణయించిన జగనన్న అమ్మఒడి పథకాన్ని యథాతథంగా అమలు చేస్తామన్నారు.

Also Read:పంచాయతీ.: వైఎస్ జగన్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ షాక్

ఇప్పటికే జీవో నెంబర్ 3 విడుదల చేశామని.. రాష్ట్రంలో 44,08,921 మందికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుందన్నారు. రూ.6,612 కోట్లతో అమ్మ ఒడి అమలు చేసి తీరతాం. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతా ల్లో డబ్బు జమ చేస్తారని సురేశ్ ప్రకటించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించారు.