Asianet News TeluguAsianet News Telugu

AP EAMCET 2022 : నేడే APSCHE కౌన్సెలింగ్ 2022 సీట్ల కేటాయింపు ఫలితాలు.. ఎలా చూసుకోవాలంటే..

APSCHE కౌన్సెలింగ్ 2022 సీట్ల కేటాయింపు ఫలితం ఈరోజు cets.apsche.ap.gov.inలో విడుదల కానుంది. విద్యార్థులు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీలతో తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

AP EAMCET Counselling 2022 : APSCHE Seat Allotment Result releasing today
Author
First Published Sep 22, 2022, 8:50 AM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, APSCHE, AP EAMCET 2022 కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను cets.apsche.ap.gov.inలో ఈరోజు విడుదల చేయనుంది. కచ్చితమైన విడుదల సమయం ఇంకా ప్రకటించనప్పటికీ, ఫలితాలు సాయంత్రం వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అధికారిక వెబ్‌సైట్ ఫలితాల లింక్‌ను అందుబాటులోకి తెచ్చిన వెంటనే యాక్టివేట్ చేస్తుంది. అభ్యర్థులు తాము ఎంచుకుని, పత్రాలు సమర్పించిన వెబ్ ఆఫ్షన్ల ద్వారానే సీట్ల కేటాయింపు ఉంటుందని గమనించాలి. సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 17, 2022 మధ్య, వెబ్ ఆప్షన్స్ ఇన్వైట్ చేశారు.  

అభ్యర్థులు సీట్ల కేటాయింపు ఫలితం విడుదలైన తర్వాత సెప్టెంబర్ 23 నుండి 27, 2022 వరకు సెల్ఫ్ జాయిన్, రిపోర్టింగ్‌ను కొనసాగించాలి. సెప్టెంబర్ 27లోపు రాని విద్యార్థులను నెక్ట్స్ స్టెప్ కోసం పరిగణనలోకి తీసుకోబడరు.

AP EAMCET 2022 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో చూడండి..

- cets.apsche.ap.gov.inలో APSCHE అధికారిక సైట్‌లోకి వెళ్లాలి.

- హోమ్‌పేజీలో, AP EAMCET 2022 లింక్‌పై క్లిక్ చేయాలి..

- మరొక పేజీకి రీ డైరెక్ట్ అయిన తర్వాత, AP EAMCET 2022 సీట్ల కేటాయింపు ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.

- అప్పుడు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన పై క్లిక్ చేయాలి.

- ఆ తరువాత సీటు కేటాయింపు ఫలితం స్క్రీన్‌పై కనబడుతుంది. 

- ఫలితాన్ని చెక్ చేసుకుని.. ఆ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

-  అభ్యర్థులు తదుపరి అవసరాల కోసం ఫలితాల హార్డ్ కాపీని తీసిపెట్టుకోవాలి. 

AP EAMCET 2022 పరీక్షకు సంబంధించిన ఇంజనీరింగ్ స్ట్రీమ్ జూలై 4 నుండి 8, 2022 వరకు జరిగింది. జూలై 11, 12, 2022న, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ కోసం పరీక్ష జరిగింది. జూలై 26, 2022 తర్వాత, అభ్యర్థులు AP EAMCETని యాక్సెస్ చేయడానికి అర్హులు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవడానికి వీరు మాత్రమే అర్హులు.

Follow Us:
Download App:
  • android
  • ios