చట్టబద్దంగానే వ్యవహరిస్తున్నాం:విపక్షాల విమర్శలపై ఏపీ డీజీపీ
చట్టప్రకారంగానే తాము వ్యవహరిస్తున్నామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో అర్ధం లేదన్నారు.
అమరావతి: తాము చట్టప్రకారంగానే వ్యవహరిస్తున్నామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.పోలీస్ శాఖపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు.సోమవారంనాడుఆయన మీడియాతో మాట్లాడారు. తాము చట్టప్రకారంగానే వ్యవహరిస్తున్నామన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కేసు విషయంలో కూడా చట్ట ప్రకారంగానే వ్యవహరించినట్టుగా ఆయన వివరించారు. లోన్ యాప్ లపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. లోక్ అదాలత్ లలో 47 వేలకు పైగా కేసులను పరిష్కరించినట్టుగా ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.ప్రధానంగా టీడీపీ నేతలు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. వైసీపీ నేతలు చెప్పినట్టుగా తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని పోలీసులపై టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అక్రమ కేసులు నమోదు చేసిన పోలీసులపై తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంంటామని ప్రకటించారు.అంతేకాదుఅక్రమంగా కేసులు నమోదు చేసిన పోలీసులపై ప్రైవేట్ కేసులు నమోదు చేయిస్తున్నారు చంద్రబాబు. విశాఖ గర్జన సమయంలో మంత్రుల కార్లపై దాడి చేశారని జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు ఆ రోజున విశాఖ ఎయిర్ పోర్టు నుండి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రోడ్ షో జరిగే సమయంలో ఐపీఎస్ అధికారి వ్యవహరించిన తీరును కూడా ఆయన పనవ్ కళ్యాణ్ తప్పుబట్టారు. ఇప్పటం గ్రామంలో కూల్చేసిన ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.పోలీసుల తీరును పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు.